Amol Muzumdar: మా అమ్మాయిలు అద్భుతం చేశారు: కోచ్
ABN , Publish Date - Nov 03 , 2025 | 02:09 PM
ప్రతి భారతీయుడు గర్వపడేలా మహిళా జట్టు చేసిందని భారత ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది మహిళా క్రికెట్‌కు సువర్ణాధ్యాయమని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఒక్క మ్యాచ్ ఆడకుండానే ప్రపంచ కప్ గెలిచాడు.. అతడే భారత మహిళా జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్. ప్రతి భారతీయుడు గర్వపడేలా మహిళా జట్టు చేసిందని అమోల్(Amol Muzumdar) ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది మహిళా క్రికెట్‌కు సువర్ణాధ్యాయమని వెల్లడించాడు.
‘ఇప్పుడు నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. భారత మహిళా క్రికెట్ అద్భుతం చేసింది. ఇప్పుడు సాధించిన గెలుపుకు వారు పూర్తి అర్హులు. రెండేళ్ల కిందట భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా ఓటములను చవి చూశాం. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ఈ స్థాయికి చేరుకున్నాం. ఆ తర్వాత చాలా మ్యాచుల్లో ఆధిపత్యం ప్రదర్శించాం. కొన్ని మ్యాచుల్లో ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. కానీ చేయలేకపోయాం. కానీ ముగింపు మాత్రం అద్భుతం. కఠినమైన శ్రమ, నమ్మకంతోనే ఇది సాధ్యమైంది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిన జట్టుకు అభినందనలు’ అని అమోల్ వెల్లడించాడు.
ఫలితం కనిపించింది..
‘జట్టులో ప్రతి ఒక్కరూ విజయం కోసం చివరి వరకూ అద్భుతంగా పోరాడారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూనే ఫీల్డింగ్‌లో రాణించారు. కీలక సమయంలో వికెట్లు తీసిన షెఫాలీ వర్మ స్పెల్ సూపర్. ఫీల్డింగ్ గురించి డ్రెస్సింగ్ రూంలో చర్చించుకున్నాం. దాని ఫలితం ఈ ఫైనల్‌లో కనిపించింది. సెమీస్, ఫైనల్‌కు స్టేడియం మొత్తం నిండిపోవడం చాలా బాగుంది. ఫైనల్‌లో పరుగులు(87) చేయడమే కాకుండా రెండు వికెట్లు తీసిన షెఫాలీ మాయ చేసిందనే చెప్పాలి’ అని అమోల్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
Harmanpreet-Gavaskar: నాడు గావస్కర్.. నేడు హర్మన్!
Harmanpreet Kaur: ఆ ఓటమి మాలో మార్పు తెచ్చింది: హర్మన్