Romario Shepherd 20 runs: ఒక్క బంతికి 20 పరుగులు.. రొమారియో షెపర్డ్ ఏం చేశాడో చూడండి..
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:20 PM
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియ షెపర్డ్ అద్భుతం చేసి చూపించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరఫున ఆడుతూ అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్నాడు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియ షెపర్డ్ (Romario Shepherd) అద్భుతం చేసి చూపించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025 highlights)లో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరఫున ఆడుతూ అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్నాడు. సెయింట్ లూసియాతో జరిగిన తాజా మ్యాచ్‌లో ఒక బంతికి 20 పరుగులు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (CPL 2025 video).
సెయింట్ లూసియా బౌలర్ థామస్ వేసిన 15వ ఓవర్ మూడో బంతి నోబాల్ అని అంపైర్ ప్రకటించాడు. ఆ బంతికి రొమారియో పరుగులేమీ చేయలేదు. అయితే అది నో బాల్ కావడంతో థామస్ అదనంగా మరో బంతి వేయాల్సి వచ్చింది. ఆ బంతిని రొమారియా సిక్సర్‌గా మలిచాడు. అయితే అది కూడా నో బాల్ అని తేలింది. ఆ బంతిని కూడా రొమారియా సిక్సర్‌గా మలిచాడు. అయితే అది కూడా నో బాల్ అని తేలింది. ఆ తర్వాత బంతిని కూడా రొమారియా సిక్సర్‌గా మలిచాడు (Romario Shepherd 73 runs).
దీంతో 15వ ఓవర్ మూడో బంతికి రొమారియా మూడు సిక్స్‌లు కొట్టి మొత్తం 20 పరుగులు రాబట్టాడు. మొత్తానికి ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రొమారియా 34 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అందులో మొత్తం 7 సిక్స్‌లు ఉన్నాయి. గత ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఆడిన రొమారియా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. జైస్వాల్ (13 బంతులు) తర్వాత ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి