Asian Shooting Championship 2025: ఇషా బృందానికి కాంస్యం
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:26 AM
ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌పలో హైదరాబాదీ ఇషాసింగ్ పతకం సాధించింది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో ఇషా సింగ్, మనూ భాకర్, సిమ్రన్‌ప్రీత్ కౌర్ త్రయం మూడోస్థానంలో నిలిచి...
నీరూ డబుల్ గోల్డ్
ఆసియా షూటింగ్
షిమ్‌కెంట్ (కజకిస్థాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌పలో హైదరాబాదీ ఇషాసింగ్ పతకం సాధించింది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో ఇషా సింగ్, మనూ భాకర్, సిమ్రన్‌ప్రీత్ కౌర్ త్రయం మూడోస్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. చైనా స్వర్ణం, కొరియా రజత పతకం అందుకున్నాయి.
నీరూకు రెండు స్వర్ణాలు: జాతీయ క్రీడల చాంపియన్ నీరూ ధండ రెండు స్వర్ణాలతో దుమ్మురేపింది. తొలుత మహిళల ట్రాప్‌లో నీరూ పసిడి పతకం కొల్లగొట్టింది. భారత్‌కే చెందిన ఆషిమా అహ్లావత్ కాంస్య పతకం నెగ్గింది. అనంతరం నీరూ, ఆషిమా, ప్రీతీ రజాక్ బృందం మహిళల ట్రాప్ టీమ్ పసిడి పతకం సొంతం చేసుకుంది. పురుషుల ట్రాప్ విభాగంలో భౌనీష్ రజతం నెగ్గాడు. జూనియర్ మహిళల 25 మీ. పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్లు పాయల్ ఖత్రి, నామ్యా కపూర్, తేజస్విని వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గి క్లీన్‌స్వీప్ చేశారు. అలాగే టీమ్ విభాగంలో పాయల్, కపూర్, తేజస్విని త్రయం రజత పతకం కూడా అందుకోవడం విశేషం.
ఇవి కూడా చదవండి..
యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా.. రాకెట్‌ను విరగ్గొట్టిన డానియెల్ మెద్వదేవ్.. వీడియో వైరల్..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..