Share News

US Open 2025: మెద్వెదెవ్‌ అవుట్‌

ABN , Publish Date - Aug 26 , 2025 | 02:31 AM

రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌కు వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌లోనూ మొదటి రౌండ్‌లో చుక్కెదురైంది. 2021 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ మెద్వెదెవ్‌కు ఫ్రాన్స్‌ ఆటగాడు బెంజమిన్‌ బోన్జీ మళ్లీ షాకిచ్చాడు. ఇక ఏడో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌, టాప్‌ సీడ్‌...

US Open 2025: మెద్వెదెవ్‌  అవుట్‌

యూఎస్‌ ఓపెన్‌

ఓటమి అనంతరం అసహనంతో రాకెట్‌ విరగ్గొట్టిన మెద్వెదెవ్‌

తొలి రౌండ్‌లోనే ఇంటిదారి

జొకో, సబలెంక బోణీ

న్యూయార్క్‌: రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌కు వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌లోనూ మొదటి రౌండ్‌లో చుక్కెదురైంది. 2021 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ మెద్వెదెవ్‌కు ఫ్రాన్స్‌ ఆటగాడు బెంజమిన్‌ బోన్జీ మళ్లీ షాకిచ్చాడు. ఇక ఏడో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌, టాప్‌ సీడ్‌ సబలెంక, నాలుగో సీడ్‌ పెగుల, ఏడో సీడ్‌ పోలిని, 10వ సీడ్‌ నవారో శుభారంభం చేశారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో అన్‌ సీడెడ్‌ బోన్జీ 6-3, 7-5, 6-7 (7), 0-6, 6-4తో 13వ సీడ్‌ మెద్వెదెక్‌కు ఝలకిచ్చాడు. వింబుల్డన్‌ మొదటి రౌండ్‌లో కూడా డానిల్‌ను బోన్జీ తిరుగుముఖం పట్టించడం గమనార్హం. ఇక..25వ గ్రాండ్‌స్లామ్‌ వేటలో ఉన్న జొకోవిచ్‌ 6-1, 7-6 (3), 6-2తో టీన్‌పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరాడు. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ 7-5, 6-2, 6-4తో ఎమీలో నవాపై, 21వ సీడ్‌ మక్‌హాక్‌ 6-3, 6-1, 6-1తో నార్డీపై, నకాషిమా 6-2, 6-7 (7), 2-6, 6-2, 7-6 (10)తో జోంగ్‌పై నెగ్గి రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ సబలెంక 7-5, 6-1తో రెబెకా మసరోవాని, పెగుల 6-0, 6-4తో మయార్‌ షరీ్‌ఫను, పోలిని 6-2, 7-6 (4)తో ఐవాని, 10వ సీడ్‌ నవారో 7-6 (9), 6-3తో వాంగ్‌ని, 16వ సీడ్‌ బెన్సిక్‌ 6-3, 6-3తో జాంగ్‌ని, అజరెంకా 7-6 (0), 6-4తో ఇనోని,


అలెగ్జాండ్రా సంచలనం

ఫిలిప్పీన్స్‌కు చెందిన 20 ఏళ్ల అలెగ్జాండ్రా యాలా సంచలనం సృష్టించింది. తొలి రౌండ్‌లో 6-3, 2-6, 7-6 (13--11)తో 14వ సీడ్‌ క్లారా టాసన్‌ను చిత్తు చేసింది. తద్వారా ఓపెన్‌ ఎరాలో గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌ డ్రా మ్యాచ్‌ గెలిచిన తొలి ఫిలిప్పీన్స్‌ ప్లేయర్‌గా అలెగ్జాండ్రా రికార్డుకెక్కింది. భారీ సంఖ్యలో విచ్చేసిన ఫిలిప్పీన్స్‌ దేశస్తులు ప్రోత్సహిస్తుండగా ఐదడుగుల తొమ్మిది అంగుళాల పొడగరి అయిన యాలా విజృంభించి ఆడింది. మూడో సెట్‌లో 1-5 వెనుకంజలో నిలిచినా అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా.. రాకెట్‌ను విరగ్గొట్టిన డానియెల్ మెద్వదేవ్.. వీడియో వైరల్..

ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 26 , 2025 | 02:31 AM