Ravi Shastri: ఓటమికి హెడ్ కోచ్ బాధ్యత వహించాలి.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 02 , 2025 | 02:53 PM
గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక భారత్ వరుస ఓటములను చవి చూస్తుంది. సౌతాఫ్రికాతో టెస్టులో స్వదేశంలోనే వైట్ వాష్‌కు గురైంది. ఈ విషయంపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. తానే కోచ్‌గా ఉంటే ఓటమికి బాధ్యత తీసుకునేవాడినని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్.. ఆ తర్వాత శ్రీలంక, ఆసీస్ వన్డే సిరీస్ ఓటమి.. తాజాగా సౌతాఫ్రికాతో టెస్టులో క్లీన్ స్వీప్.. గౌతమ్ గంభీర్ టీమిండియాకు ప్రధాన కోచ్ అయిన 16 నెలల కాలంలో భారత్ వరుసగా ఘోర పరాభవాలు ఎదుర్కొంటుంది. స్వదేశంలోనే టీమిండియా ఓడిపోతుండటంతో గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సౌతాఫ్రికాతో టెస్టులో భారత్ అత్యంత పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. ప్రొటీస్ స్పిన్నర్లను ఎదుర్కోలేక భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. బౌలర్లు కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితం.. సిరీస్ ఓటమి. దీనిపై మాజీ కోచ్ రవి శాస్త్రి(Ravi Shastri) తాజాగా స్పందించాడు.
‘గువాహటి టెస్టులో టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. 95/1 నుంచి కళ్లు మూసి తెరిచే లోపే వరుసగా వికెట్లు కోల్పోయి 130/7తో కష్టాల్లో పడింది. టీమిండియా పేలవమైన జట్టు కాదు. మన ఆటగాళ్లు ఎంతో ప్రతిభావంతులు. వారికి స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం కూడా కొత్తేమీ కాదు. కాబట్టి కచ్చితంగా ప్లేయర్లంతా మరింత బాధ్యత తీసుకుని ఆడాలి. జట్టు పేలవ ప్రదర్శన విషయంలో నేను గంభీర్(Gautam Gambhir)ను విమర్శించను. కానీ వంద శాతం అతడు బాధ్యత తీసుకోవాలి. నేనే కోచ్‌గా ఉంటే ఓటమికి మొదటి బాధ్యత తీసుకునేవాడిని. కానీ జట్టు సమావేశంలో ఆటగాళ్లను కచ్చితంగా ప్రశ్నించేవాడిని’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి:
Moeen Ali IPL Retirement: ఐపీఎల్‌కు మరో స్టార్ ప్లేయర్ దూరం
Kane Williamson Record: కేన్ విలియమ్సన్ ఖాతాలో భారీ రికార్డు