Pakistans ODI Captaincy Changes: కెప్టెన్‌ను మళ్లీ మార్చారు
ABN , Publish Date - Oct 22 , 2025 | 02:50 AM
పాకిస్థాన్ క్రికెట్ సారథిని మరోసారి మార్చారు. ఈసారి వన్డే కెప్టెన్ రిజ్వాన్‌పై వేటుపడింది. వచ్చే నెల ఆరంభంలో దక్షిణాఫ్రికాతో మొదలయ్యే మూడు వన్డేల సిరీ్‌సకు సీనియర్ పేసర్ షహీన్ షా అఫ్రీదికి...
పాక్ వన్డే సారథి రిజ్వాన్‌కు ఉద్వాసన
షహీన్ షా అఫ్రీదికి పగ్గాలు
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ సారథిని మరోసారి మార్చారు. ఈసారి వన్డే కెప్టెన్ రిజ్వాన్‌పై వేటుపడింది. వచ్చే నెల ఆరంభంలో దక్షిణాఫ్రికాతో మొదలయ్యే మూడు వన్డేల సిరీ్‌సకు సీనియర్ పేసర్ షహీన్ షా అఫ్రీదికి సారథ్య బాధ్యతలు అప్పగించారు. వైట్‌బాల్ కోచ్ మైక్ హెస్సన్ సూచనల మేరకే నాయకత్వ మార్పు జరిగినట్టు తెలుస్తోంది. కోచ్‌గా హెస్సన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెస్టిండీ్‌సతో వన్డే సిరీస్‌కు మాత్రమే రిజ్వాన్‌తో కలిసి పనిచేశాడు. ఇంత తక్కువ సమయంలో కెప్టెన్‌పై హెస్సన్ ఇలాంటి అభిప్రాయానికి రావడంపై మాజీ ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేసున్నారు. కానీ, కొందరు మాత్రం అసలు కారణాలు వేరే ఉన్నాయని చెబుతున్నారు. రిజ్వాన్‌లో మతమౌఢ్యం రోజురోజుకూ పెరిగిపోతోందని..డ్రెస్సింగ్ రూమ్‌లో ఆట గురించి కాకుండా మతపరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడుతున్నాడని సమాచారం. రిజ్వాన్‌ను తప్పించాలన్న నిర్ణయం వెనుక సెలెక్షన్ కమిటీ, హైపర్ఫామెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావెద్‌తోపాటు పీసీబీ చైర్మన్, మాజీ కెప్టెన్లు మిస్బావుల్ హక్, సర్ఫరాజ్ ఖాన్‌ల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే పాలస్తీనా గురించి బహిరంగంగా మాట్లాడడం కూడా ఓ కారణం అంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ కంపెనీలను తాను ఎండార్స్ చేయనని రిజ్వాన్ అన్నాడు. అయితే బెట్టింగ్ కంపెనీలతో ఒప్పందాలున్న పాక్ క్రికెట్ బోర్డుకు ఇది ఇబ్బంది కల్గించివుండవచ్చు.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి