Pakistan Bowler Challenge To Abhishek: అభిషేక్ శర్మకు పాక్ పేసర్ సంచలన సవాల్!
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:28 PM
పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లో భారత బ్యాటింగ్ సంచలనం అభిషేక్ శర్మకు సవాల్ విసిరాడు. తన వేగవంతమైన బౌలింగ్ అభిషేక్ ను కచ్చితంగా ఇబ్బంది పెడుతుందని ఇహ్సానుల్లా చెబుతున్నాడు.
టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ పై పాకిస్థాన్ క్రికెట్ జట్టు బాగా కసితో ఉంది. ఇటీవల జరిగిన ఆసియాకప్ 2025 టోర్మమెంట్ లో అదరగొట్టిన అభిషేక్ శర్మ...పాకిస్థాన్ బౌలర్లను షేక్ చేశాడు. పాక్ పేసర్ షాహిన్ అఫ్రిదీతో పాటు మిగిలిన బౌలర్లకు చుక్కలు చూపించాడు. పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల్లో దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేసి.. భారత్ ఆసియా కప్ టైటిల్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో తాజాగా ఓ పాకిస్థాన్ పేసర్..అభిషేక్ శర్మ విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడు.
పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లో(Ihsanullah bowling speed) భారత బ్యాటింగ్ సంచలనం అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు సవాల్ విసిరాడు. తన వేగవంతమైన బౌలింగ్ అభిషేక్ శర్మను కచ్చితంగా ఇబ్బంది పెడుతుందని ఇహ్సానుల్లా చెబుతున్నాడు. 2023లో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో(PSL) 152.65కేఎంపీహెచ్ వేగంతో ఇహ్సానుల్లా బౌలింగ్ చేశాడు. ఆ టైమ్ లో పలువురు స్టార్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఈక్రమంలో అతడు ఓ వీడియోలో మాట్లాడుతూ.. తాను ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలనని అత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంత వరకు బాగానే ఉన్న.. తన వీడియోలో అభిషేక్ శర్మను ప్రస్తావిస్తూ..తన ఓవర్ కాన్ఫిడెన్స్ ను ప్రదర్శించాడు. ఒకవేళ తనకు భారత్(Indian cricket latest news)తో ఆడే అవకాశం వస్తే.. 3 నుంచి 6 బంతుల్లో అభిషేక్ శర్మను ఔట్ చేస్తానని తెలిపాడు.
ఆ వీడియోలో ఇహ్సానుల్లా మాట్లాడుతూ.. "నా 140 కేఎంపీహెచ్ బౌలింగ్ అతడికి 160 కేఎంపీహెచ్ లా అనిపిస్తుంది. వాటిని అభిషేక్ అంచనా వేయలేడు. నేను ఎడమచేతి వాటం బ్యాటర్లకు ఇన్‌స్వింగర్లు వేస్తాను. నేను నా బౌన్సర్లతో ఎడమచేతి వాటం బ్యాటర్ల కుడి భుజాన్ని లక్ష్యంగా చేసుకుంటాను. నా బౌన్సర్‌లు చాలా ప్రభావంతంగా ఉంటాయి' అని ఇహ్సానుల్లా అన్నాడు. అయితే అతడిపై క్రికెట్ అభిమాన్లు సెటైర్లు వేస్తున్నారు. మీ వాళ్లకు చూపించిన చుక్కలు నీకు చూపించే వరకు నీ నోరు ఆగదు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నిన్ను సముద్రంలోకి నెట్టేశాం.. గిల్‌కు గంభీర్ హెచ్చరిక
India Dominates West Indies: అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో