Share News

India break Test record: చరిత్ర సృష్టించిన భారత్

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:36 AM

టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 65 ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌ పై వరుసగా ఐదు వికెట్లకు 50 ప్లస్ భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా భారత్ అరుదైన రికార్డ్‌ నమోదు చేసింది.

India break Test record: చరిత్ర సృష్టించిన భారత్
India record

భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తో టెస్ట్ క్రికెట్ లో టీమిండియా చరిత్ర సృష్టించింది. అంతేకాక 65 ఏళ్ల తర్వాత తొలిసారి వెస్టిండిస్ పై వరుసగా ఐదు వికెట్లకు 50+ భాగస్వామ్యాలను నెలకొల్పిన జట్టుగా భారత్ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.


టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా చరిత్ర(India Test record) సృష్టించింది. 65 ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌(West Indies)పై వరుసగా ఐదు వికెట్లకు 50 ప్లస్ భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా భారత్ అరుదైన రికార్డ్‌ నమోదు చేసింది. విండీస్ తో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా టాప్-5 బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, ధృవ్ జురెల్ వరుసగా ఐదు వికెట్లకు 50 ఫ్లస్ పరుగుల పార్ట్‌నర్‌షిప్స్ అందించారు.


మొదటి వికెట్‌కు రాహుల్-జైస్వాల్ 58, రెండో వికెట్‌కు జైస్వాల్-సాయి సుదర్శన్ 193, మూడో వికెట్‌కు జైస్వాల్-శుభ్‌మన్ గిల్ 69, నాలుగో వికెట్‌కు గిల్-నితీష్ కుమార్ రెడ్డి 91, ఐదో వికెట్‌కు శుభ్‌మన్ గిల్- జురెల్ 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 1960 తర్వాత కరేబియన్ జట్టుపై ఒక టీమ్ వరుసగా ఐదు వికెట్లకు 50 ప్లస్ రన్స్ భాగస్వామ్యం నమోదవ్వడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డ్‌ను వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా నమోదు చేసింది. 1960లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన గబ్బా టెస్ట్‌లో ఆసీస్(Australia) ఈ ఫీట్ సాధించింది.


93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా(India Test record) ఈ ఫీట్ సాధించడం మూడో సారి. 1993లో తొలిసారి ఇంగ్లాండ్(England) పై ముంబై వేదికగా వరుసగా 5 వికెట్లకు 50 ప్లస్ రన్స్ భాగస్వామ్యాలను భారత్ నమోదు చేసింది. అనంతరం 2023లో ఆస్ట్రేలియాపై అహ్మదాబాద్ వేదికగా రెండో సారి ఈ ఫీట్ ను భారత్ అందుకుంది. తాజాగా విండీస్ పై ముచ్చటగా మూడోసారి ఈ ఫీట్ టీమిండియా(India) అందుకుంది.



ఇవి కూడా చదవండి

Rohit Sharma Scolds Security: అభిమాని కోసం.. సెక్యూరిటీపై రోహిత్ ఫైర్!

Womens World Cup: కంగారూలతో కఠిన పరీక్షే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 12 , 2025 | 11:37 AM