Share News

Mohammed siraj: బుమ్రా లేకపోతేనే మెరుగైన ప్రదర్శన.. ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ సిరాజ్..

ABN , Publish Date - Aug 26 , 2025 | 08:47 PM

ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో అత్యధిక ఓవర్లు వేయడమే కాకుండా, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు.

Mohammed siraj: బుమ్రా లేకపోతేనే మెరుగైన ప్రదర్శన.. ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ సిరాజ్..
Bumrah with Siraj

ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో అత్యధిక ఓవర్లు వేయడమే కాకుండా, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు (Siraj performance). ఈ సిరీస్‌లో బుమ్రా మూడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బుమ్రా లేని రెండు మ్యాచ్‌ల్లో సిరాజ్ పేస దళాన్ని నడిపించడమే కాకుండా, మెరుగైన ప్రదర్శన కూడా చేశాడు (Jasprit Bumrah absence).


బుమ్రా లేనప్పుడే సిరాజ్ మెరుగైన ప్రదర్శన చేస్తాడని చాలా మంది అనుకుంటున్న తరుణంలో ఆ అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిరాజ్ స్పందించాడు. 'బాధ్యతను మోసే అవకాశం వచ్చినపుడు నేను మెరుగైన ప్రదర్శన చేస్తాను. బాధ్యత అనేది నాలో ఉత్సాహం కలిగిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఇతర బౌలర్లలో నమ్మకాన్ని కలిగించేందుకు కూడా నా వంతు ప్రయత్నం చేస్తా. బుమ్రా జట్టులో లేనప్పుడు ఆ బాధ్యత నాదే' అని సిరాజ్ చెప్పాడు (Siraj interview).


వర్క్‌లోడ్ కారణంగా జస్ప్రీత్ బుమ్రాకు జట్టు మేనేజ్‌‌మెంట్ విశ్రాంతినిస్తోంది. దీంతో బుమ్రా తర్వాత సీనియర్ అయిన సిరాజ్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు 41 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 123 వికెట్లు తీసుకున్నాడు. ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అలాగే వన్డేలు, టీ-20ల్లో కూడా సిరాజ్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు.


ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్‌ అవుట్‌

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం

మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 26 , 2025 | 08:47 PM