Share News

Mohammed Shami: షమీ తిరిగొస్తాడా..?

ABN , Publish Date - Oct 28 , 2025 | 09:47 PM

మహ్మద్ షమీ భారత్ తరఫున చివరగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఆ తర్వాత ఏ ఫార్మాట్‌లోనూ జాతీయ జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు. ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా అతడిని పక్కన పెడుతున్నారన్న వాదన ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనూ చోటు దక్కకపోవడంతో షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Mohammed Shami: షమీ తిరిగొస్తాడా..?
Mohammed Shami

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) రంజీ ట్రోఫీ(Ranji Trophy 2025)లో అదరగొడుతున్నాడు. భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన షమీ రంజీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. బెంగాల్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. ఎలైట్ గ్రూప్ సిలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్‌(Bengal vs Gujarat)తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు ఇచ్చి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో గుజరాత్‌ను బెంగాల్ 141 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇదే రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్‌తో జరిగిన పోరులో షమీ ఏడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.


మహ్మద్ షమీ భారత్ తరఫున చివరగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఆ తర్వాత ఏ ఫార్మాట్‌లోనూ జాతీయ జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు. ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా అతడిని పక్కన పెడుతున్నారన్న వాదన ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనూ చోటు దక్కకపోవడంతో షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు సరిపోయే ఫిట్‌నెస్.. వన్డేలు ఆడటానికి సరిపోదా? అంటూ సెలక్టర్లను ప్రశ్నించాడు. కాగా రంజీల్లో చేస్తున్న ప్రదర్శన చూసైనా షమీని జట్టులోకి తిరిగి తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో, రెండో మ్యాచ్ నవంబర్ 22 నుంచి గౌహతిలో జరగనుంది. ఈ సిరీస్ కోసం త్వరలోనే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈడెన్‌లో రాణించిన షమీని సఫారీలతో జరిగే టెస్టులకు ఎంపిక చేస్తారో లేదో చూడాల్సి ఉంది.


Also Read:

మరీ ఇంత దారుణమా.. ఆడపిల్ల అని కూడా చూడకుండా..

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. శ్రేయస్ అయ్యర్‌ను రీప్లేస్ చేసేది ఎవరు..?

Updated Date - Oct 28 , 2025 | 09:48 PM