Share News

Shreyas Iyer replacement: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. శ్రేయస్ అయ్యర్‌ను రీప్లేస్ చేసేది ఎవరు..?

ABN , Publish Date - Oct 28 , 2025 | 09:32 PM

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ అందుకుంటున్న క్రమంలో అయ్యర్ ప్లీహానికి బలమైన గాయమైంది. అతడు ప్రస్తుతం సిడ్నీలోని హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు.

Shreyas Iyer replacement: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. శ్రేయస్ అయ్యర్‌ను రీప్లేస్ చేసేది ఎవరు..?
Shreyas Iyer replacement

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ అందుకుంటున్న క్రమంలో అయ్యర్ ప్లీహానికి బలమైన గాయమైంది. అతడు ప్రస్తుతం సిడ్నీలోని హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయ్యర్ తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు కాస్త ఎక్కువ సమయమే పట్టవచ్చనే వార్తలు వస్తున్నాయి (India vs South Africa ODI).


వచ్చే నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ సమయానికి శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో నాలుగో స్థానంలో ఎవరిని ఆడించాలనే విషయంలో మేనేజ్‌మెంట్ ముందు పలు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అయ్యర్ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూ ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడి స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడి గురించి సెలక్టర్లు ప్రస్తుతం అన్వేషణలో పడ్డారు (Iyer injury).


శ్రేయస్ ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాళ్ల జాబితాలో ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి (Indian batsmen options ). తెలుగు ఆటగాడు, తాజా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో అమోఘంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించిన తిలక్ వర్మ ఆ స్థానానికి సరిగ్గా సరిపోతాడని చాలా మంది భావిస్తున్నారు. శ్రేయస్ తరహాలోనే తిలక్ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటూ, స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టగలడని విశ్లేషిస్తున్నారు. అలాగే యశస్వి జైస్వాల్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక, ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు రియాన్ పరాగ్, రజత్ పటిదార్ పేర్లను కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారని సమాచారం.


Also Read:

ఇందుకే సింహాన్ని మృగరాజు అంటారు.. మొసలిని చూసి ఏం చేసిందో చూడండి..

రైతులకు గుడ్ న్యూస్.. ఎరువులపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

Updated Date - Oct 28 , 2025 | 09:34 PM