Share News

Lion vs crocodile: ఇందుకే సింహాన్ని మృగరాజు అంటారు.. మొసలిని చూసి ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:18 PM

నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలోని మొసలి నోటికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు కోల్పోవాల్సిందే. భారీ ఏనుగులు, పులులు కూడా నీటిలోని మొసలిని చూస్తే భయపడతాయి. నీటిలోకి వస్తే సింహంపై కూడా మొసళ్లు దాడి చేస్తాయి.

Lion vs crocodile: ఇందుకే సింహాన్ని మృగరాజు అంటారు.. మొసలిని చూసి ఏం చేసిందో చూడండి..
jungle video 2025

నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలోని మొసలి నోటికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు కోల్పోవాల్సిందే. భారీ ఏనుగులు, పులులు కూడా నీటిలోని మొసలిని చూస్తే భయపడతాయి. నీటిలోకి వస్తే సింహంపై కూడా మొసళ్లు దాడి చేస్తాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో సింహం మాత్రం తాను అడవికి రారాజునని నిరూపించుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (wildlife viral video).


@wildfriends_africa అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆఫ్రికాలోని ఓ అడవిలో సింహం నది దాటడానికి వెళ్తోంది. ఒడ్డు మీద నుంచి నీటిలోకి దిగుతున్న సమయంలో హఠాత్తుగా అక్కడకు ఓ మొసలి వచ్చింది. ఆ మొసలిని చూసి ఆ సింహం షాక్ అయి వెనక్కి ఓ అడుగు వేసింది. అయితే ఆ తర్వాత సింహం ముందుకే వెళ్లింది. మొసలి ఉన్న నీటిలోకి దిగి ధైర్యంగా నదిని దాటింది. సింహాన్ని మొసలి చూసినప్పటికీ దాని జోలికి మాత్రం వెళ్లలేదు. ఆ సింహం ధైర్యంగా నదిని దాటేసి అవతలి ఒడ్డుకు చేరుకుంది (shocking animal encounter).


ఆ వీడియోను ఓ సఫారీ టూరిస్ట్ కెమెరాలో బంధించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (jungle video 2025). ఈ వైరల్ వీడియోను కొద్ది సమయంలోనే 50 వేల మందికి పైగా వీక్షించారు. మూడు వేల మందికి పైగా లైక్ చేసి ఆ సింహంపై ప్రశంసలు కురిపించారు. సింహం భయాన్ని నీటిలో ముంచేసిందని ఒకరు కామెంట్ చేశారు. తానే అడవికి రారాజు అని ఆ సింహం చూపించాలనుకుందంటూ మరొకరు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఇదెక్కడి స్టంట్.. చివరకు ఆ అమ్మాయి పరిస్థితి ఏమైందో చూడండి..


మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 37 సెకెన్లలో కనిపెట్టండి


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 28 , 2025 | 06:22 PM