Funny scooter stunt: వామ్మో.. ఇదెక్కడి స్టంట్.. చివరకు ఆ అమ్మాయి పరిస్థితి ఏమైందో చూడండి..
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:04 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది వ్యూస్, లైక్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదకర సాహసాలు చేసి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా బైక్ స్టంట్‌లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది వ్యూస్, లైక్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదకర సాహసాలు చేసి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా బైక్ స్టంట్‌లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Papas angel scooter stunt).
@dbabuadvocate అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి రోడ్డుపై స్కూటీ నడపడానికి రెడీ అయింది. అకస్మాత్తుగా ముందు చక్రాన్ని గాల్లోకి లేపింది. కొద్ది దూరం అలాగే ముందుకు వెళ్లింది. అయితే ఎక్కువ సేపు స్కూటీని అలా గాల్లో బ్యాలెన్స్ చేయలేకపోయింది. వెంటనే స్కూటీతో పాటు కింద పడిపోయింది. కింద పడిపోయిన ఆ యువతిని కాపాడేందుకు ఓ పోలీస్ అక్కడకు వెళ్లారు. ఆ యువతి గాయాలపాలైనట్టు తెలుస్తోంది (girl scooter wheelie).
ఆ ఘటనను రికార్డు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (shocking stunt video). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ అమ్మాయి తన బైక్‌ను విమానంలా టేకాఫ్ చేయాలనుకుందని, కానీ ల్యాండింగ్ చేయడం మర్చిపోయిందని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మీ పిల్లలు ఎక్కువగా క్రీమ్ బిస్కెట్లు తింటుంటారా.. ముందు ఈ విషయం తెలుసుకోండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ గదిలో దాక్కున్న కప్పను 25 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..