Cream biscuits: మీ పిల్లలు ఎక్కువగా క్రీమ్ బిస్కెట్లు తింటుంటారా.. ముందు ఈ విషయం తెలుసుకోండి..
ABN , Publish Date - Oct 27 , 2025 | 03:23 PM
సాధారణంగా చాలా మంది పిల్లలు క్రీమ్ బిస్కెట్లను ఎక్కువగా తింటుంటారు. బిస్కెట్ల కంటే క్రీమ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే క్రీమ్ బిస్కెట్ల గురించి ఓ ఆశ్చర్యకర విషయం చాలా మందికి తెలియదు. బిస్కెట్లలో ఉండే క్రీమ్‌ను పాలతో తయారు చేస్తారని అనుకుంటాం.
సాధారణంగా చాలా మంది పిల్లలు క్రీమ్ బిస్కెట్లను ఎక్కువగా తింటుంటారు. బిస్కెట్ల కంటే క్రీమ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే క్రీమ్ బిస్కెట్ల గురించి ఓ ఆశ్చర్యకర విషయం చాలా మందికి తెలియదు. బిస్కెట్లలో ఉండే క్రీమ్‌ను పాలతో తయారు చేస్తారని అనుకుంటాం. అయితే ప్రస్తుతం మార్కెట్లలో లభ్యమవుతున్న చాలా క్రీమ్ బిస్కెట్లు ఎలా తయారవుతున్నాయో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Cream biscuits for kids).
ఆ వీడియోలో ఒక టీచర్ పదుల సంఖ్యలో ఉన్న పిల్లలకు క్రీమ్ బిస్కెట్ల గురించి చెబుతున్నారు. బిస్కెట్లపై ఉండే క్రీమ్ పాలతో తయారు కావడం లేదని పిల్లలకు అర్థమయ్యేలా ఆ టీచర్ వివరిస్తున్నారు. ఆ క్రీమ్ పూర్తిగా వెజిటబుల్ ఆయిల్, కలర్, పంచదారతో మాత్రమే తయారవుతోందని, అలా తయారయ్యే బిస్కెట్లు ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. ఇకపై క్రీమ్ బిస్కెట్లు కొనేటపుడు ప్యాకెట్ మీద ఉండే పదార్థాల జాబితాను చదవాలని సూచించారు. ఆ టీచర్ చెబుతున్న దానిని పిల్లలందరూ చాలా శ్రద్ధగా విన్నారు (biscuit cream filling).
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఎంతో మందిని ఆలోచింపచేస్తోంది (Food Habits). క్రీమ్ బిస్కెట్లు తినడం వల్ల కలిగే హానికర ప్రభావాల గురించి పిల్లలకు తెలియాలని ఒకరు కామెంట్ చేశారు. మనం ఏమి తింటున్నామో, పిల్లలకు ఏమి తినిపిస్తున్నామో తెలుసుకోవాలని కొందరు సూచించారు. ఆరోగ్యకర ఆహార అలవాట్ల గురించి చిన్నప్పట్నుంచి నేర్పించాలని కొందరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి