Share News

Sam Curran: సామ్ కరన్ వార్నింగ్ ఇచ్చాడా.. పంజాబ్ కింగ్స్ డగౌట్ వైపు చూస్తూ ఏం చేశాడంటే

ABN , Publish Date - May 01 , 2025 | 07:30 PM

బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సామ్ కరన్ వ్యవహరించిన తీరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సామ్ కరన్ గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడాడు. ఆ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. అయితే సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రిటెయిన్ చేసుకోలేదు.

Sam Curran: సామ్ కరన్ వార్నింగ్ ఇచ్చాడా.. పంజాబ్ కింగ్స్ డగౌట్ వైపు చూస్తూ ఏం చేశాడంటే
Sam Curran

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ (CSK vs PBKS) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సామ్ కరన్ (Sam Curran) వ్యవహరించిన తీరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సామ్ కరన్ గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడాడు. ఆ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. అయితే సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రిటెయిన్ చేసుకోలేదు. మెగా వేలంలో కూడా అతడి పట్ల ఆసక్తి ప్రదర్శించలేదు. దీంతో అతడిని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది (IPL 2025).


చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా సామ్ కరన్ ఈ ఏడాది మెరుగైన ప్రదర్శనేం చేయలేదు. అయితే బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటాడు. 47 బంతుల్లోనే 88 పరుగులు చేసి చెన్నై భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. హాఫ్ సెంచరీ పూర్తి కాగానే సామ్ కరన్ కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. పంజాబ్ డగౌట్ వైపు చూస్తే ఫోన్ కాల్ అన్నట్టు సంజ్ఞలు చేశాడు. అలాగే అతడు అవుటై వెళ్తున్నప్పుడు పంజాబ్ డగౌట్ వైపు చూస్తూ తల ఊపుకుంటూ వెళ్లాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సామ్ కరన్‌కు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. ఈ సీజన్‌లో ఇతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న చెన్నైను తన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమి పాలు కావడంతో సామ్ కరన్ హాఫ్ సెంచరీ పోరాటం వృథా అయింది.

ఇవి కూడా చదవండి..

ధోనీ రిటైరైతే బెటర్‌!

హెచ్‌సీఏకు ఊరట

‘అజర్‌’ పేరును తొలగించొద్దు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 01 , 2025 | 07:30 PM