Share News

IPL 2025 MI vs RR: బుమ్రా vs వైభవ్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లపై ఓ లుక్కేద్దామా

ABN , Publish Date - May 01 , 2025 | 05:42 PM

ఈ రోజు జైపూర్‌లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. గత మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ పైనే అందరి కళ్లూ ఉంటాయనడంలో సందేహం లేదు. ముంబై టాప్ క్లాస్ బౌలర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడో చూడడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

IPL 2025 MI vs RR: బుమ్రా vs వైభవ్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లపై ఓ లుక్కేద్దామా
RR vs MI

ఐపీఎల్‌లో (IPL 2025) మరో ఆసక్తికర సమరానికి సిద్ధమవుతోంది. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన రాజస్తాన్ రాయల్స్ మరో మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI vs RR) తో తలపడుతోంది. గత మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavamshi ) పైనే అందరి కళ్లూ ఉంటాయనడంలో సందేహం లేదు. ముంబై టాప్ క్లాస్ బౌలర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడో చూడడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు.

mi2.jpg


ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమైన ముంబై ఇండియన్స్ (MI) జట్టు ఆ తర్వాత అద్భుతమైన ఆటతీరుతో పుంజుకుంది. ఏకంగా పాయింట్స్ టేబుల్‌లో టాప్ స్పాట్‌కు చేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. బుమ్రా రాకతో ముంబై టీమ్‌‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. బుమ్రా జట్టుతో చేరినప్పటి నుంచి ముంబై వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. రోహిత్ శర్మ, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. తిలక్ వర్మ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఇక, ముంబై బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

mi4.jpg


మరోవైపు వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌తో రాజస్తాన్ ఉత్సాహంగా కనిపిస్తోంది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుసగా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. రియాన్ పరాగ్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. గత సీజన్‌లో మెరిసిన ధ్రువ్ జురెల్ ఈ సీజన్‌లో ఆకట్టుకోలేకపోతున్నాడు. హిట్‌మెయర్ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. నితీష్ రాణా కూడా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఇక, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే ప్రత్యర్థులను కట్టడి చేయగలుగుతున్నారు.

ఇవి కూడా చదవండి..

ధోనీ రిటైరైతే బెటర్‌!

హెచ్‌సీఏకు ఊరట

‘అజర్‌’ పేరును తొలగించొద్దు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 01 , 2025 | 05:42 PM