Share News

IPL 2025 MI vs RR: ముంబై టాప్ లేపుతుందా.. రాజస్తాన్ విజయాల పరంపర కొనసాగిస్తుందా

ABN , Publish Date - May 01 , 2025 | 05:17 PM

ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. మరోవైపు గత మ్యాచ్‌లో ఘన విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాజస్తాన్ రాయల్స్ బరిలోకి దిగుతోంది.

IPL 2025 MI vs RR: ముంబై టాప్ లేపుతుందా.. రాజస్తాన్ విజయాల పరంపర కొనసాగిస్తుందా
MI vs RR

టోర్నీ (IPL 2025) ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమైన ముంబై ఇండియన్స్ (MI) జట్టు ఆ తర్వాత అద్భుతమైన ఆటతీరుతో పుంజుకుంది. ఏకంగా పాయింట్స్ టేబుల్‌లో టాప్ స్పాట్‌కు చేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌ (RR)తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. మరోవైపు గత మ్యాచ్‌లో ఘన విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాజస్తాన్ రాయల్స్ బరిలోకి దిగుతోంది (RR vs MI).

mi1.jpg


రాజస్తాన్ గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ రోజు మ్యాచ్‌లో కూడా రాజస్తాన్ గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడ్డాయి. అందులో ముంబై 16 సార్లు విజయం సాధించగా, 15 సార్లు రాజస్తాన్ గెలుపొందింది. ఇక, ఈ రోజు మ్యాచ్ జరిగే సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్‌దే ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఈ స్టేడియంలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 9 సార్లు తలపడ్డాయి. అందులో 7 సార్లు రాజస్తాన్‌దే పైచేయి. కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ముంబై విజయం సాధించింది.


సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాత్రి సమయంలో మంచు ప్రభావం ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో ఈ పిచ్‌లో రెండో సారి బ్యాటింగ్ చేయడం సులభం అవుతుంది. ఎప్పటిలాగానే ఈ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది. మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. జైపూర్‌లో మ్యాచ్ సమయంలో చాలా వేడిగా ఉంటుంది. దాదాపు 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువ.

ఇవి కూడా చదవండి..

ధోనీ రిటైరైతే బెటర్‌!

హెచ్‌సీఏకు ఊరట

‘అజర్‌’ పేరును తొలగించొద్దు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండిv

Updated Date - May 01 , 2025 | 05:17 PM