Share News

IPL 2025 GT vs SRH: హైదరాబాద్ ఓటమి.. గుజరాత్ ఘన విజయం

ABN , First Publish Date - May 02 , 2025 | 07:21 PM

IPL 2025 GT vs SRH Match Live Updates in Telugu: ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా శుక్రవారం నాడు ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో మరి. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ బాల్ టు బాల్ అప్‌డేట్స్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది.

IPL 2025 GT vs SRH: హైదరాబాద్ ఓటమి.. గుజరాత్ ఘన విజయం
IPL 2025 GT vs SRH

Live News & Update

  • 2025-05-02T23:33:43+05:30

    హైదరాబాద్ ఓటమి

    • 38 పరుగుల తేడాతో గెలుపొందిన గుజరాత్ టైటన్స్

  • 2025-05-02T23:20:53+05:30

    • 19వ ఓవర్‌లో భారీ షాట్స్‌కు ప్రయత్నించిన నితీశ్, కమిన్స్

    • మూడో బంతికి సిక్స్ కొట్టిన కమిన్స్

    • చివరి రెండు బంతులకు సిక్స్‌లు బాదిన నితీశ్

  • 2025-05-02T23:16:47+05:30

    ఒకే ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు డౌన్

    • సిరాజ్ బౌలింగ్‌లో (16.4) అనికేత్ ఔట్, షారుఖ్‌కు క్యాచ్

    • తరువాతి బంతికి కమిందు మెండిస్ డకౌట్

    • 17 ఓవర్లకు స్కోరు 149/6

  • 2025-05-02T23:12:55+05:30

    కష్టాల్లో సన్‌రైజర్స్.. మరో వికెట్ డౌన్

    • నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    • ప్రసిద్ధ కృష్ణ వేసిన బంతికి(15.3) వికెట్ కీపర్ బట్లర్‌కు క్యాచిచ్చి ఔటైన క్లాసెస్

  • 2025-05-02T23:05:42+05:30

    కీలక వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

    • అభిషేక్ శర్మ ఔట్ (74)

    • 15వ ఓవర్ ఇషాంత్ వేసిన బంతికి సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్

    • ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 139/3

  • 2025-05-02T22:46:30+05:30

    • రషీద్ ఖాన్ వేసిన ఓవర్‌లో అభిషేక్ వీరబాదుడు

    • 13 ఓవర్ ముగిసేసరికి ఎస్ఆర్‌హెచ్ స్కోరు 123/2

  • 2025-05-02T22:42:32+05:30

    అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

    • 12 ఓవర్లకు స్కోరు 109/2

    • క్రీజులో అభిషేక్ (56), క్లాసెస్(12)

  • 2025-05-02T22:34:14+05:30

    రెండో వికెట్ డౌన్... ఎస్‌ఆర్‌హెచ్‌పై పెరుగుతున్న ఒత్తిడి

    • ఇషాన్ కిషన్ రూపంలో రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    • గెరాల్డ్ కొయెట్జీ వేసిన బంతికి(9.3) షాట్‌కు ప్రయత్నించి విఫలం

    • ప్రసిద్ధ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టిన వైనం

    • పది ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 85/2

    • క్రీజులో క్లాసెస్ (2), అభిషేక్ (48)

  • 2025-05-02T22:26:49+05:30

    నిలకడగా హైదరాబాద్

    • ప్రసిద్ధ కృష్ణ పొదుపుగా బౌలింగ్... ఏడో ఓవర్‌లో కేవలం 6 పరుగులు

    • ఓవర్ ముగిసేసరికి ఎస్ఆర్‌హెచ్ స్కోరు 63//1

  • 2025-05-02T22:18:09+05:30

    ముగిసిన పవర్ ప్లే

    • పవర్ ప్లే ముగిసేసరికి ఎస్ఆర్‌హెచ్ స్కోరు 57/1

    • క్రీజులో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ

  • 2025-05-02T22:12:15+05:30

    తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    • ట్రావిస్ హెడ్ ఔట్ (20)

    • ప్రసిద్ధ కృష్ణ వేసిన బంతికి (4.3) భారీ షాట్‌కు ప్రయత్నం

    • బౌండరీ వద్ద అద్భుత క్యాచ్ పట్టి ట్రావిస్‌ను పెవిలియన్ బాట పట్టించిన ట్రావిస్ హెడ్

    • ఐదు ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 50/1

  • 2025-05-02T21:25:10+05:30

    గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది.

    • నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన టైటాన్స్ టీమ్ 224 పరుగులు చేసింది.

    • 225 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ ముందుంచింది.

    • మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్.. చివర్లో వరుసగా వికెట్లు సమర్పించుకుంది.

  • 2025-05-02T20:52:11+05:30

    15 ఓవర్లు కంప్లీట్.. గుజరాత్ స్కోర్ ఎంతంటే..

    • గుజరాత్ బ్యాట్స్‌మెన్ అదరగొడుతున్నారు.

    • మ్యాచ్ ఆరంభం నుంచి దుమ్మురేపుతున్నారు.

    • ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శనం వీరవిహారం చేయడంతో జట్టు స్కోర్ అమాంతం పెరిగింది.

    • ప్రస్తుతం జీటీ స్కోర్ 162/2.

    • ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్ - 30, వాషింగ్టన్ సుందర్ - 6 ఉన్నారు.

  • 2025-05-02T20:47:06+05:30

    రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్

    • శుబ్‌మన్ గిల్ ఔటయ్యాడు.

    • 38 బంతుల్లో 76 పరుగులు చేశాడు గిల్.

    • ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.

  • 2025-05-02T20:09:47+05:30

    ఫస్ట్ వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్..

    • గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔట్ అయ్యాడు.

    • 23 బంతుల్లో 9 ఫోర్లతో చెలరేగిన సాయి సుదర్శన్ 48 పరుగులు చేశాడు.

    • జీటీ స్కోర్ 7 ఓవర్లు, 89/1

  • 2025-05-02T19:56:33+05:30

    తగ్గేదేలే అంటున్న జీటీ ఓపెనర్స్..

    • శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వీర బాదుడు బాదుతున్నారు.

    • 5 ఓవర్లలోనే 71 పరుగులు చేశారు.

    • సాయి సుదర్శన్ 44 పరుగులు.

    • శుబ్‌మన్ గిల్ 26 పరుగులు చేశారు.

  • 2025-05-02T19:45:06+05:30

    కుమ్మేస్తున్న ఓపెనర్స్..

    గుజరాత్ టైటాన్స్ ఓపెనర్స్ కుమ్మేస్తున్నారు.

    శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వీర బాదుడు బాదుతున్నారు.

    3 ఓవర్లలోనే 36 పరుగులు చేశారు.

    సాయి సుదర్శన్ 26 పరుగులు చేశాడు.

    గిల్ 10 పరుగులు చేశాడు.

  • 2025-05-02T19:24:35+05:30

    ఎస్ఆర్‌హెచ్ ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-05-02T19:24:34+05:30

    గుజరాత్ టైటాన్స్ ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-05-02T19:21:57+05:30

    టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్.. కానీ..

    • ఎస్ఆర్‌హెచ్ టీమ్ టాస్ గెలిచింది.

    • కానీ, ఈసారి బౌలింగ్ ఎంచుకుంది.

    • గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌కు దిగనుంది.