Share News

Asia Cup celebration: ట్రోఫీ లేకుండానే టీమిండియా సంబరాలు.. ఆ ఐడియా ఎవరిదంటే..

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:30 PM

ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ చాలా వాడివేడిగా సాగింది. ముఖ్యంగా భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీ తీసుకోలేకపోయింది.

Asia Cup celebration: ట్రోఫీ లేకుండానే టీమిండియా సంబరాలు.. ఆ ఐడియా ఎవరిదంటే..
Asia Cup 2025 celebration

ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ చాలా వాడివేడిగా సాగింది. ముఖ్యంగా భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీ తీసుకోలేకపోయింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్‌గా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ తనతో పాటే ట్రోఫీని తీసుకెళ్లిపోయారు. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించడంతో అతడు తనతో పాటు హోటల్ గదికి ట్రోఫీని తీసుకెళ్లిపోయారు (India Asia Cup no trophy).


ట్రోఫీ లేకపోయినప్పటికీ టీమిండియా ఆటగాళ్లు తమదైన శైలిలో సంబరాలు చేసుకున్నారు. గత టీ-20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్ ట్రోఫీ అందుకుని రోబోలా నడిచి వచ్చాడు. ట్రోఫీ లేకపోయినా ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అదే తరహాలో నడిచి వచ్చి జట్టు ఆటగాళ్లతో సంబరాలు చేసుకున్నాడు. ఇలా చేయడం వెనుక టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఉన్నాడట. ఈ విషయాన్ని తాజాగా వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు (Arshdeep Singh idea).


'ట్రోపీ కోసం చాలా సేపు ఎదురు చూశాం. కానీ అలా జరగలేదు (Asia Cup final behind the scenes). అప్పుడు అర్ష్‌దీప్ ఒక ఐడియా ఇచ్చాడు. ట్రోఫీ లేకపోయినా కప్ అందుకున్నట్టు చేద్దామని, తర్వాత ఫొటోలు మార్చుకుందామని చెప్పాడు. దీంతో అందరం అలాగే చేశాం. నేనూ కూడా అలాగే చేశా. బెడ్ పైన నా పక్కన కాఫీ కప్ ఉంచారు. ట్రోఫీ లేకుండా సంబరాలు చేసుకోవడం చాలా కొత్తగా ఉంది. మా డ్రెస్సింగ్ రూమ్‌లో అద్భుతమైన వాతావరణ ఉంది' అని వరుణ్ చెప్పాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 01:30 PM