Share News

IND vs WI 2nd Test: తొలి రోజు అదరగొట్టిన భారత్‌..స్కోర్ ఎంతంటే!

ABN , Publish Date - Oct 10 , 2025 | 05:28 PM

యువ ఓపెనర్‌ జైస్వాల్‌ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. ద్విశతకం (173*) దిశగా సాగుతున్నాడు. టెస్టు కెరీర్‌లో అతడికిది ఏడో శతకం. మూడో సెషన్‌లో అతడు 150+ స్కోరుకు చేరుకున్నాడు. టెస్టుల్లో తొలి రోజే ఇలా 150కిపైగా పరుగులు నమోదు చేయడం ఇది రెండోసారి.

IND vs WI 2nd Test: తొలి రోజు  అదరగొట్టిన భారత్‌..స్కోర్ ఎంతంటే!
IND vs WI 2nd Test

ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ తో భారత్ రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు దుమ్ములేపారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరి చేయగా.. సాయి సుదర్శన్ సైతం అదిరిపోయే ప్రదర్శన చేశాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్(IND vs WI 2nd Test) రెండు వికెట్లు కోల్పోయి.. 318 పరుగులు చేసింది. మరోవైపు టీమిండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో విండీస్ బౌలర్లు విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో జైశ్వాల్‌(173)తో పాటు కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌(20) ఉన్నాడు.


ఇక తొలి టెస్టులో శతకం నమోదు చేసిన కేఎల్‌ రాహుల్‌ 38 పరుగుల వద్ద వారికన్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్‌-సాయిసుదర్శన్‌(Sai Sudharsan) రెండో వికెట్‌కు 193 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 165 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 ప‌రుగులు చేసిన సుద‌ర్శన్.. తృటిలో తన తొలి టెస్టు సెంచరీ ఛాన్స్ కోల్పోయాడు. స్పిన్నర్ వారికన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు సుదర్శన్ దొరికిపోయాడు. సుదర్శన్‌ ఔటయ్యాక జైశ్వాల్‌ గిల్‌తో కలిసి స్కోర్‌ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.


యువ ఓపెనర్‌ జైస్వాల్‌(Yashasvi Jaiswal Century) అద్భుత ఆరంభాన్నిచ్చాడు. 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. ద్విశతకం (173*) దిశగా సాగుతున్నాడు. టెస్టు కెరీర్‌లో అతడికిది ఏడో శతకం. మూడో సెషన్‌లో అతడు 150+ స్కోరుకు చేరుకున్నాడు. టెస్టుల్లో తొలి రోజే ఇలా 150కిపైగా పరుగులు నమోదు చేయడం ఇది రెండోసారి. అతడి ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్‌(173*), గిల్‌ (20*)(Shubman Gill) ఉన్నారు. గిల్‌ కూడా రాణిస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ స్కోరు ఖాయమే. ఇక విండీస్‌ బౌలర్లు వికెట్లు తీయడంలో తొలి టెస్టు మాదిరిగానే మరోసారి ఇబ్బందిపడ్డారు. రెండో టెస్టులో తొలి రోజు వచ్చిన రెండు వికెట్లు కూడా స్పిన్నర్‌ వారికన్‌ తీసినవే కావడం గమన్హారం.


ఇవి కూడా చదవండి:

Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బిగ్ రిలీఫ్.. తొలిసారి !

IPL 2026: CSK రిలీజ్ చేయనున్న ప్లేయర్లు వీరే!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 10 , 2025 | 05:31 PM