IND Playing XI: తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే!
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:40 PM
ఆస్ట్రేలియా, భారత్ మధ్య అక్టోబర్ 29(బుధవారం) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగనుంది.
ఆస్ట్రేలియా, భారత్(India vs Australia T20) మధ్య అక్టోబర్ 29(బుధవారం) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌న(T20 WC 2026)కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగనుంది. 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. పొట్టి సిరీస్ అయినా పట్టాలనే పట్టుదలతో ఉంది.
పొట్టి ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు ఆడిన 32 మ్యాచ్‌ల్లో 20 సార్లు గెలుపొందింది. ఆసీస్ కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత యువ జట్టు ఇదే ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తోంది. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లపై అభిమానుల భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. వన్ డౌన్‌లో తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. సంజూ శాంసన్ సక్సెస్ ట్రాక్‌లోనే ఉన్నాడు. గిల్ నుంచి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నాయి. శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లుగా సత్తా చాటుతున్నారు. వరుణ్ చక్రవర్తి పర్వాలేదనపిస్తున్నాడు. బుమ్రా, అర్ష్‌దీప్ రాణిస్తున్నారు. ప్రస్తుతం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ ఒక్కటే టీమిండియా(Team India)ను కలవరపెడుతుంది. ఈ ఆసీస్ సిరీస్‌లో అయినా లయ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే సూర్య ఫామ్‌పై హెడ్ కోచ్ గంభీర్ కూడా స్పందించాడు. ఫామ్ అనేది సమస్యే కాదని స్పష్టం చేశాడు.
తొలి టీ20.. భారత జట్టు అంచనా!
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఇవీ చదవండి:
ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49శాతం విదేశీ పెట్టుబడులు
Sensex Rise: సెన్సెక్స్ 567 పాయింట్లు అప్