Sensex Rise: సెన్సెక్స్ 567 పాయింట్లు అప్
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:38 AM
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహం, యూఎస్ ఫెడ్ రేట్లు మరింత తగ్గవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ సూచీలూ సోమవారం లాభాల్లో పయనించాయి. విదేశీ సంస్థాగత...
ఇంట్రాడేలో 26,000 ఎగువకు నిఫ్టీ
ముంబై: అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహం, యూఎస్ ఫెడ్ రేట్లు మరింత తగ్గవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ సూచీలూ సోమవారం లాభాల్లో పయనించాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులూ ఇందుకు దోహదపడ్డాయి. ఒక దశలో 720 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. చివరికి 566.96 పాయింట్ల లాభంతో 84,778.84 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 26,000 ఎగువకు చేరిన నిఫ్టీ.. 170.90 పాయింట్ల వృద్ధితో 25,966.05 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 22 రాణించాయి.
బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములకు రూ.700 తగ్గుదలతో రూ.1,25,900కు దిగివచ్చింది. కిలో వెండి ఏకంగా రూ.4,250 తగ్గి రూ.1,51,250కు పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ 4,015 డాలర్లకు, సిల్వర్ 47.60 డాలర్లకు దిగివచ్చాయి.
లెన్స్‌కార్ట్ ఐపీఓ ధరల శ్రేణి రూ.382-402
కళ్ల జోళ్ల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ రూ.7,278 కోట్ల పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 31న ప్రారంభమై నవంబరు 4న ముగియనుంది. ఐపీఓలో విక్రయించే షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.382-402గా నిర్ణయించింది.
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి