India Win: చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 132 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్
ABN , Publish Date - Nov 16 , 2025 | 09:03 PM
సౌతాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత్-ఏ జట్టు ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.
ఇంటర్నెట్ డెస్క్: రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న అనధికారిక మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్-ఏ జట్టు(India-A vs South Africa-A) ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా-ఏ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. యువ ఆల్‌రౌండర్ నిశాంత్ సింధు( Nishant Sindhu bowling) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. అతడు తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఈ హర్యానా ప్లేయర్ ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి.. కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 కీలక వికెట్లను పడగొట్టాడు. అతడితోపాటు హర్షిత్ రాణా 3, ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీశారు.
సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్‌సామి(33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పొటిగిటర్(23), ప్రిటోరియస్(21) కూడా రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా ప్రొటీస్ ఏ జట్టు చేయగలిగింది. మొత్తం ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. ఇక 133 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ఏ- జట్టు 27.5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) (68*) హాఫ్ సెంచరీ బాదాడు. అభిషేక్ శర్మ (32), తిలక్ వర్మ (29) రాణించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో భారత్-ఏ(cricket India-A 2-0) మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. కాగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా-ఏ జట్టును 4 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఇక మూడో వన్డే నవంబర్ 19 రాజ్ కోట్(Rajkot ODI) వేదికగానే జరగనుంది.
ఇవి కూడా చదవండి:
IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం
Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి