Share News

Gautam Gambhir: పిచ్ కాదు.. మా ఓటమికి వాళ్లే కారణం: గౌతమ్ గంభీర్

ABN , Publish Date - Nov 16 , 2025 | 07:01 PM

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోరంగా ఓడింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ స్పందించాడు.

Gautam Gambhir: పిచ్ కాదు.. మా ఓటమికి వాళ్లే కారణం: గౌతమ్ గంభీర్
autam Gambhir comments

కోల్‌కతాలో వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా(India vs South Africa first test) మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం కేవలం మూడు రోజుల్లోనే తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. సౌతాఫ్రికా నిర్దేశించిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక భారత్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో రెండో ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఒక్క వాషింగ్టన్ సుందర్(31) మినహా మిగతా ఏ ప్లేయర్ కూడా క్రీజులో నిలబడలేక పోయారు.


ఇక ఈ ఘోర ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం భారత్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్( Gautam Gambhir comments) స్పందించాడు. తామే ఇటువంటి పిచ్‌నే కోరుకున్నట్లు ఆయన స్పష్టం చేశాడు. ' మేము అడిగిన పిచ్‌ను తయారు చేసి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నాము. మేము ఎప్పటి నుంచో ఇటువంటి పిచ్ కోసమే ఎదురు చూస్తున్నాము. క్యూరేట‌ర్ మాకు అన్ని విధాల స‌హ‌క‌రించారు. అయితే ఈ వికెట్‌పై మా ప్లేయర్లు మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయారు. ఆ కారణంతోనే మేము ఓడిపోయాము. ఇది బ్యాటింగ్‌కు క‌ష్టత‌ర‌మైన పిచ్ కాదు. మంచి డిఫెన్స్ టెక్నిక్‌ ఉంటే, ఇలాంటి వికెట్‌పై కూడా ప‌రుగులు సాధించ‌వ‌చ్చు' అని మీడియా సమావేశంలో గంభీర్ పేర్కొన్నాడు.


మరోవైపు ఈడెన్ గార్డెన్స్ పిచ్‌( Eden Gardens pitch controversy)పై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పిచ్‌ల వ‌ల్ల టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని మాజీ భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్(Harbhajan Singh) మండిప‌డ్డాడు. కాగా ఈ పిచ్‌ను టీమిండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సూచన మేరకే ఈడెన్ గార్డెన్స్ క్యూరేట‌ర్‌ తయారు చేసినట్లు సౌరబ్ గంగూలీ సైతం వెల్లడించాడు. దీంతో గంభీర్‌ను కూడా నెటిజ‌న్లు టార్గెట్ చేశాడు. కోచ్‌గా అత‌డిని తీసేయాలంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.



ఇవి కూడా చదవండి:

IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం

Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 07:21 PM