Share News

IPL 2026: త్వరలోనే మళ్లీ కలుస్తా.. ఐపీఎల్‌కు మరో ప్లేయర్ దూరం!

ABN , Publish Date - Dec 02 , 2025 | 03:31 PM

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు స్టార్ ప్లేయర్లు వీడ్కోలు పలుకుతున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేరాడు. ఈ ఏడాది వేలంలో తన పేరును రిజిస్టర్ చేయించుకోవద్దని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు.

IPL 2026: త్వరలోనే మళ్లీ కలుస్తా.. ఐపీఎల్‌కు మరో ప్లేయర్ దూరం!
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు స్టార్ ప్లేయరంతా ఈ లీగ్‌కు వీడ్కోలు పలుకుతున్నారు. ఇప్పటికే ఫాఫ్ డుప్లెసిస్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ వంటి ఆటగాళ్లు ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ జాబితాలోనే మరో స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) కూడా చేరినట్లు తెలుస్తోంది. మ్యాక్సీ పరోక్షంగా ఈ విషయం గురించి పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.


2-maxy.jpg

‘ఐపీఎల్‌లో నాకు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇన్ని సీజన్స్ తర్వాత ఈ ఏడాది(IPL 2026) వేలంలో నా పేరును రిజిస్టర్ చేయించుకోవద్దని నిర్ణయించుకున్నాను. ఇది నాకు సవాలుతో కూడుకున్న నిర్ణయమే. ఈ లీగ్ నాకు ఎన్నో అవకాశాలను అందించింది. వాటన్నింటికీ ఎంతో కృతజ్ఞుడిని. ఒక క్రికెటర్‌గా ఎదగడానికి నాకు ఐపీఎల్ ఎంతో ఉపయోగపడింది. ప్రపంచ ప్లేయర్లతో పాటు అద్భుతమైన ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే అభిమానుల ముందు ఆడే అవకాశాన్నిచ్చింది. ఐపీఎల్‌లోని జ్ఞాపకాలు, సవాళ్లు, భారత అభిమానుల ప్రేమ నాతో శాశ్వతంగా ఉంటాయి. ఇన్నేళ్లుగా మీరు అందించి మద్దతుకు ధన్యవాదాలు. మళ్లీ త్వరలోనే కలుస్తామని ఆశిస్తున్నా’ అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు.


కెరీర్ ఇలా..

2012లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన మ్యాక్స్‌వెల్ ముంబై ఇండియన్స్(2013), పంజాబ్ కింగ్స్ (2014-2017, 2020-21, 2025), ఢిల్లీ క్యాపిటల్స్(2018), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(2021-2024).. మొత్తం నాలుగు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ నాలుగు జట్ల తరఫున 141 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 23.88 సగటుతో 2819 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలున్నాయి. పంజాబ్ కింగ్స్ తరఫున గత సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్సీ 48 పరుగులే చేసాడు. దాంతో ఆ జట్టు అతడిని వేలంలోకి వదిలేసింది.


ఇవి కూడా చదవండి:

ఓటమికి హెడ్ కోచ్ బాధ్యత వహించాలి.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

అత్యంత పిన్న వయసులో సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

Updated Date - Dec 02 , 2025 | 03:46 PM