England Women vs India Women: 258 పరుగుల టార్గెట్‌తో దూసుకొచ్చిన ఇంగ్లాండ్.. భారత్ సిద్ధం
ABN , Publish Date - Jul 16 , 2025 | 10:11 PM
ఇంగ్లాండ్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు మరో ఛాలెంజ్‌కు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకొని గర్వంగా నిలిచిన భారత్, వన్డే సిరీస్‌లో కూడా అదే దూకుడు కొనసాగించాలనే లక్ష్యంతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియాపై ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 259 రన్స్ చేసింది.
ఇంగ్లాండ్ vs భారత మహిళల క్రికెట్ జట్ల (England Women vs India Women) మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జూలై 16 నుంచి సౌతాంప్టన్‌లోని ది రోజ్ బౌల్‌లో జరుగుతోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-2 తేడాతో గెలిచింది. ఈ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన తొలి సిరీస్ విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో కూడా అదే విధానాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మైదానంలోకి అడుగుపెట్టింది.
మొదటగా టాస్ గెలిచి..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ స్కైవర్-బ్రంట్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిరాశపరిచే ఆరంభాన్ని ఇచ్చింది. జట్టు ఓపెనర్లు ఇద్దరూ కేవలం 20 పరుగుల స్కోరుతో పెవిలియన్‌కు చేరారు.
ఆ తర్వాత ఎమ్మా లాంబ్ రన్, నాట్ స్కైవర్-బ్రంట్ కలిసి ఇన్నింగ్స్‌ను నిర్వహించి జట్టు స్కోరును 90 పరుగులకు మించి తీసుకెళ్లారు. ఆ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తరఫున సోఫియా డంక్లీ 83 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్ 53 పరుగులు చేసింది.
భారత్ తరఫున..
మరోవైపు క్రాంతి గౌర్ టీమ్ ఇండియాకు తొలి పెద్ద విజయాన్ని అందించారు. టీమ్ ఇండియా తరఫున, క్రాంతి గౌర్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా కాకుండా, శ్రీచరణి, అమంజోత్ కౌర్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ గెలవాలంటే టీం ఇండియా 50 ఓవర్లలో 259 పరుగులు చేయాలి. రెండు జట్లు ఈ మ్యాచ్ గెలిచి ఈ సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని కోరుకుంటున్నాయి.
ఇరు జట్ల మధ్య..
ఇటీవల, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఇది జట్టు మనోధైర్యాన్ని మరింత పెంచింది. ఈ సిరీస్‌లో, టీమ్ ఇండియాకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా, ఇంగ్లాండ్‌కు నాట్ స్కైవర్-బ్రంట్ నాయకత్వం వహిస్తున్నారు. ఇంగ్లాండ్ మహిళలు, భారత మహిళల మధ్య మొత్తం 19 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ఇంగ్లాండ్ మహిళా జట్టు 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, భారత మహిళా జట్టు 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి