Harry Brook Stars: కివీస్‌కు ఇంగ్లండ్ ఝలక్
ABN , Publish Date - Oct 22 , 2025 | 02:34 AM
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 65 పరుగుల తేడాతో గెలిచింది. ఫిల్ సాల్ట్ (85), హ్యారీ బ్రూక్ (78) చెలరేగడంతో మొదట ఇంగ్లండ్...
క్రైస్ట్‌చర్చ్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 65 పరుగుల తేడాతో గెలిచింది. ఫిల్ సాల్ట్ (85), హ్యారీ బ్రూక్ (78) చెలరేగడంతో మొదట ఇంగ్లండ్.. 20 ఓవర్లలో 4 వికెట్లకు 236 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెథెల్ (12 బంతుల్లో 24), ఆఖర్లో టామ్ బాంటమ్ (12 బంతుల్లో 29) వేగంగా ఆడారు. జేమీసన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో రషీద్ (4/32)తో పాటు మిగతా బౌలర్ల ధాటికి కివీస్ 18 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సీఫెర్ట్ (39), శాంట్నర్ (36), చాప్‌మన్ (28) మినహా అంతా విఫలమయ్యారు. ల్యూక్ వుడ్, కార్స్, డాసన్ తలో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బ్రూక్ నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి