Share News

RR vs RCB Prediction: ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ.. దుమ్ములేపేదెవరు.. దొరికిపోయేదెవరు..

ABN , Publish Date - Apr 13 , 2025 | 02:15 PM

IPL 2025: క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. ఆదివారం నాడు తొలి ఫైట్‌లో రాజస్థాన్-బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు టీమ్స్‌లో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..

RR vs RCB Prediction: ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ.. దుమ్ములేపేదెవరు.. దొరికిపోయేదెవరు..
RR vs RCB Prediction

బిగ్ స్కోరింగ్ మ్యాచెస్‌తో సమ్మర్‌లో మరింత హీట్ పుట్టిస్తోంది ఐపీఎల్-2025. ఒకదాన్ని మించి మరో థ్రిల్లింగ్ ఫైట్స్ ఆడియెన్స్‌ను కుర్చీల్లో కూర్చోకుండా చేస్తున్నాయి. ఈ హీట్‌ను నెక్స్ట్ రేంజ్‌కు తీసుకెళ్లేందుకు సండే రెడీ అయిపోయింది. ఇవాళ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా రెండు పోరాటాలు జరగనున్నాయి. అందలో మొదటగా రాజస్థాన్ రాయల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల బలాబలాలు, హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..


బలాలు

రాజస్థాన్: బ్యాటింగ్‌లో హిట్‌మెయిర్‌తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. ఓపెనర్ జైస్వాల్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అదరగొట్టాడు. అటు బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ ప్రధాన బలంగా మారాడు. అతడితో పాటు సందీప్ శర్మ, తీక్షణ కూడా అవసరమైనప్పుడు వికెట్లు తీస్తున్నారు.

బెంగళూరు: ఈ జట్టుకు బ్యాటింగే బలం. సాల్ట్, కోహ్లీ, డేవిడ్, పాటిదార్ రూపంలో సాలిడ్ బ్యాటర్లు స్క్వాడ్‌లో ఉన్నారు. అయితే కోహ్లీ-పాటిదార్‌‌లు విఫలమైతే ఇన్నింగ్స్‌ను నడిపించే బ్యాటర్లు కనిపించడం లేదు. లివింగ్‌స్టన్, పడిక్కల్, జితేష్ నిలకడగా పరుగులు చేస్తే ఆర్సీబీ కష్టాలు తీరతాయి. బౌలింగ్‌లో భువనేశ్వర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.


బలహీనతలు

రాజస్థాన్: బట్లర్, అశ్విన్, చాహల్ లాంటి కీలక ప్లేయర్లను మెగా ఆక్షన్‌కు ముందు వదులుకుంది రాజస్థాన్. ఆ ఎఫెక్ట్ తాజా సీజన్‌లో టీమ్‌పై క్లియర్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో బట్లర్‌లా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే వారు కనిపించడం లేదు. బౌలింగ్‌లో ఆర్చర్ మీద అధిక భారం పడుతోంది. మిగతా వాళ్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

బెంగళూరు: బ్యాటింగ్‌లో కోహ్లీ, పాటిదార్‌పై ఎక్కువ డిపెండెన్సీ పెట్టుకోవడం మైనస్ అని చెప్పాలి. వాళ్లిద్దరూ ఫెయిలైతే బ్యాటింగ్ యూనిట్ కొలాప్స్ అవడం గత మ్యాచ్‌లో చూశాం. బౌలింగ్‌లో దయాల్, హేజల్‌వుడ్ మరింత కట్టుదిట్టంగా బంతులు వేయాల్సిన అవసరం ఉంది.


హెడ్ టు హెడ్

ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు 32 సార్లు తలపడ్డాయి. ఇందులో బెంగళూరు 15 మ్యాచుల్లో, రాజస్థాన్ 14 మ్యాచుల్లో విజయం సాధించాయి.

విన్నింగ్ ప్రిడిక్షన్

ఓవరాల్‌గా రెండు జట్లూ పట్టిష్టంగా ఉన్నాయి. రాజస్థాన్‌కు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అయితే సాలిడ్ బ్యాటింగ్ పవర్, మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు టీమ్‌లో ఉన్నందున ఈ మ్యాచ్‌లో బెంగళూరు గెలవడం ఖాయం.

Updated Date - Apr 13 , 2025 | 02:22 PM