Rishabh Pant: ఒక్క డైలాగ్‌తో వాట్సాప్ బంద్.. ఫోన్ స్విచ్చాఫ్.. పంత్ ఎందుకిలా చేశాడంటే?
ABN , Publish Date - Jun 29 , 2025 | 06:30 PM
భారత పించ్ హిట్టర్ రిషబ్ పంత్ సూపర్ టచ్‌లో కనిపిస్తున్నాడు. ఐపీఎల్-2025 ఆఖర్లో ఫామ్‌లోకి వచ్చిన పంత్.. దాన్నే ఇంగ్లండ్ పర్యటనలోనూ కొనసాగిస్తున్నాడు.
టీమిండియా వైస్ కెప్టెన్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ ఇప్పుడు సాలిడ్ టచ్‌లో కనిపిస్తున్నాడు. ఐపీఎల్-2025లో అంతగా రాణించలేకపోయిన పంత్.. టోర్నీ ఆఖర్లో ఊపందుకున్నాడు. సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన స్టార్ బ్యాటర్.. దాన్నే ఇంగ్లండ్ సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఆ జట్టుతో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఏకంగా 2 సెంచరీలు బాదాడు పంత్. రెండు ఇన్నింగ్స్‌ల్లో చెరో శతకం బాది తన బ్యాట్ పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. అయితే కొన్నాళ్ల కింద ఫామ్ కోల్పోయిన రిషబ్.. ఒక్క డైలాగ్‌తో అంతా మార్చేశాడని తెలుస్తోంది. వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసిన పంత్.. ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసేశాడట. మరి.. అతడి కెరీర్‌ను మార్చేసిన ఆ డైలాగ్ ఏంటి? అతడు ఎలా మారాడు? అనేది ఇప్పుడు చూద్దాం..

ఫోన్ పక్కనబెట్టి..
గతేడాది చివర్లో 5 టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లింది భారత్. ఈ సిరీస్‌లో అనుకున్నంతగా రాణించలేదు టీమిండియా. 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది రోహిత్ సేన. బ్యాటర్ల వైఫల్యం జట్టును ముంచేసింది. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ ఈ పర్యటనలో 28.33 సగటుతో 255 పరుగులు మాత్రమే చేశాడు. హిట్టింగ్ కోసమని వెళ్లి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. దీంతో స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్ అంటూ కామెంట్రీ బాక్స్‌లో అతడిపై విరుచుకుపడ్డాడు లెజెండ్ సునీల్ గవాస్కర్. ఒకవైపు సిరీస్ పోవడం, మరోవైపు చాంపియన్స్ ట్రోఫీలో తుదిజట్టులో ఆడించకపోవడం, ఇంకోవైపు విమర్శలు చుట్టుముట్టడంతో ఈ ఏడాది మార్చిలో పంత్ ఫోన్‌ను పక్కనబెట్టేశాడట. ఎవరితోనైనా తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే తప్ప మొబైల్‌ను ముట్టలేదట.

రాత్రింబవళ్లు..
‘పంత్ తనను తాను మరింత మెరుగుపర్చుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. రాత్రింబవళ్లు శ్రమించాడు. కాస్త ఫ్రీ టైమ్ దొరికినా నన్ను జిమ్‌కు లాక్కెళ్లేవాడు. వర్క్ లోడ్‌ను పట్టించుకోకుండా సాధన చేశాడు. కాబట్టి అతడి విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఇంకో ఏడాది వరకు పంత్ ఫిట్‌నెస్ చేయకపోయినా ఏమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు అతడు సూపర్ ఫిట్‌గా ఉన్నాడు. తన శరీరాన్ని దృఢంగా మార్చుకోవడంపై అతడు ఆ స్థాయిలో పని చేశాడు. ఫిట్‌గా ఉన్నందునే 2 సెంచరీలు బాదాక కూడా అతడు అలుపు అనేది లేకుండా కనిపించాడు’ అని టీమిండియా మాజీ స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ చెప్పుకొచ్చాడు. ఫోన్ పక్కనబెట్టి ఫిట్‌నెస్ మీద పంత్ ఫుల్ ఫోకస్ చేశాడని.. అది అతడికి ఎంతో మంచి చేసిందన్నాడు.
ఇవీ చదవండి:
ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!
ఆర్సీబీ క్రికెటర్‌పై యువతి ఫిర్యాదు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి