Share News

Rashid Khan Create Record: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. తొలి బౌలర్‌గా రికార్డు

ABN , Publish Date - Oct 09 , 2025 | 07:52 PM

ఆఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఈ బౌలర్ ఆసియా క్రికెట్‌ చరిత్రలో సూపర్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్‌కు సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తొలి ఆసియా బౌలర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడు.

Rashid Khan Create Record: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. తొలి బౌలర్‌గా రికార్డు

ఆఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఈ బౌలర్ ఆసియా క్రికెట్‌ చరిత్రలో సూపర్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్‌కు సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తొలి ఆసియా బౌలర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడు. ఇంతకీ ఆయన సాధించిన రికార్డు ఏమిటి అనే కదా మీ సందేహం. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


తాజాగా బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ క్రమంలో బుధవారం జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్(Rashid Khan) 3 వికెట్లు తీశాడు. దీంతో వన్డే ఫార్మాట్‌లో 200+ వికెట్లు తీసిన తొలి అఫ్గాన్‌ బౌలర్‌గా నిలిచాడు. కేవలం 115 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు. అతడి తర్వాత మహ్మద్ నబీ (174 మ్యాచుల్లో 176 వికెట్లు) ఉన్నాడు. ఆసియా క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ సాధించనిన రికార్డును రషీద్ తన ఖాతాలో వేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అంటే వన్డేలు, టీ20లు. ఈ ఫార్మాట్లలో 200+ వికెట్లు, 150+ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ రషీద్‌ ఖాన్. ఇటు ఐపీఎల్‌లోనూ 150+ వికెట్లు పడగొట్టడం గమనార్హం. అంతర్జాతీయ టీ20ల్లో 179 వికెట్లు, ఐపీఎల్‌లో 158 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ద్వారా ఈ అఫ్గాన్ బౌలర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి సుపరిచితుడు.


ఇక బంగ్లాదేశ్(Bangladesh), ఆఫ్గానిస్తాన్ (Afghanistan) మధ్య తొలి వన్డే విషయానికి వస్తే.. అబుదాబీ వేదికగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 48.5 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ (60), తౌహిద్(56) హాఫ్ సెంచరీలు చేశారు. రషీద్ 3, అజ్మతుల్లా 3, ఘజన్‌ఫర్ 2, ఖరోటె 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గానిస్తాన్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన 226 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్ (50), రహ్మత్ షా (50) అర్ధ శతకాలతో పాటు అజ్మతుల్లా ఒమర్జాయ్ (40), షాహిది (33*) విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో అఫ్గాన్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఇంటర్నేషనల్ టీ-20 టీమ్ ను ప్రకటించిన సికందర్ రాజా.. కెప్టెన్ ఎవరంటే..

Mohsin Naqvi: ఆసియా కప్ ట్రోఫీ భవిష్యత్తు ఏమిటి?.. నఖ్వికి చేదు అనుభవం

Updated Date - Oct 09 , 2025 | 07:52 PM