Ranji Trophy 2025: పృథ్వీ షా విధ్వంసం
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:37 PM
మహారాష్ట్ర తరఫున తన తొలి రంజీ ట్రోఫీ ఆడుతున్న పృథ్వీ షా.. ఈ సీజన్‌లో రెండో మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా వచ్చి కేవలం 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఛండీగఢ్‌పై వారి సొంత మైదానంలోనే 29 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 222 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
మహారాష్ట్ర తరఫున తన తొలి రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఆడుతున్న పృథ్వీ షా(Prithvi Shaw).. ఈ సీజన్‌లో రెండో మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా వచ్చి కేవలం 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఛండీగఢ్‌పై వారి సొంత మైదానంలోనే 29 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 222 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. మహారాష్ట్ర తరఫున షా చేసిన ఫస్ట్ క్లాస్ సెంచరీ ఇదే. గతంలో పృథ్వీ షా ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. కానీ ఆ జట్టు అతడిని తొలగించడంతో మహారాష్ట్రలో చేరాడు.
చెలరేగిన షా..
రంజీ ట్రోఫీలోని మొదటి మ్యాచ్‌లో షా నిరాశపరిచాడు. ఆ తర్వాత ఛండీగఢ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం ఎనిమిది పరుగులే చేశాడు. ఫామ్‌లోకి వచ్చిన షా రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించాడు. తన బ్యాట్‌తో బౌలర్లకు చెమటలు పట్టించాడు. నిషాంక్ బిర్లా, సైని, రాజ్ అంగద్, విషు వంటి స్టార్ బౌలర్లు కూడా షా ముందు విఫలమయ్యారు. ఒకానొక దశలో పృథ్వీ షా 300 స్కోర్‌ను అందుకుంటాడనే అంతా భావించారు. కానీ అర్జున ఆజాద్ వేసిన బంతికి షా ఔట్ అయి పెవిలియన్ చేరాడు.
ఈ డబుల్ సెంచరీ పృథ్వీ షాకు చాలా ప్రత్యేకమైంది. రంజీ ట్రోఫీలో ఇదే అతడి వేగవంతమైన డబుల్ సెంచరీ. మహారాష్ట్ర తరఫున ఇప్పటికి వరకు ఒక్కరు కూడా డబుల్ సెంచరీ చేసిన రికార్డులు లేవు. అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత పృథ్వీ షా త్వరలోనే టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశాలు లేకపోలేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రోహిత్ మనసును చదివిన మెజీషియన్
వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు
For More Sports News And Telugu News