Share News

MI vs SRH Playing 11: ప్లేయింగ్ 11తోనే భయపెడుతున్న సన్‌రైజర్స్.. ఆపండి చూద్దాం

ABN , Publish Date - Apr 17 , 2025 | 06:16 PM

Indian Premier League: ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ సీజన్‌లో పడుతూ లేస్తున్న హార్దిక్ సేన ఒకవైపు, వరుస పరాజయాల తర్వాత ఒక్క విక్టరీతో దారిలోకి వచ్చిన ఆరెంజ్ ఆర్మీ మరోవైపు ఉన్నాయి. దీంతో థ్రిల్లింగ్ ఫైట్ తప్పేలా లేదు.

MI vs SRH Playing 11: ప్లేయింగ్ 11తోనే భయపెడుతున్న సన్‌రైజర్స్.. ఆపండి చూద్దాం
MI vs SRH Playing 11

ఐపీఎల్-2025లో బిగ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో బరిలోకి దిగింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే గతేడాది రన్నరప్‌గా నిలిచిన కమిన్స్ సేన.. ఈసారి ఆ రేంజ్‌లో ప్రభావం చూపలేకపోయింది. ఫస్ట్ మ్యాచ్‌లో విక్టరీ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ పనైపోయిందని అంతా డిసైడ్ అయ్యారు. అయితే అనూహ్యంగా పంజాబ్‌పై ఆరో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది ఎస్‌ఆర్‌హెచ్. ఇదే ఊపులో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించాలని చూస్తున్నారు కాటేరమ్మ కొడుకులు. అందుకోసం బలమైన ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది.


దూకుడే మంత్రంగా..

ప్లేయింగ్ 11తోనే ముంబై ఇండియన్స్‌ను భయపెట్టాలని ఎస్‌ఆర్‌హెచ్ ప్లాన్ చేసిందట. గత మ్యాచ్‌లో అదరగొట్టిన పేసర్ ఎషాన్ మలింగతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో తెలివిగా బంతులేసే జయదేవ్ ఉనాద్కట్‌ను ఆడించాలని చూస్తోందట. ఎంఐని ఆపేందుకు దూకుడు మంత్రాన్నే నమ్ముకుంటోందట. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అటాకింగ్ ఫార్ములాను ప్రయోగించాలని చూస్తోందట ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్. అటు ముంబై విన్నింగ్ టీమ్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. లాస్ట్ మ్యాచ్ హీరో కర్ణ్ శర్మను ఈసారి ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా దింపాలని చూస్తోందట.


సన్‌రైజర్స్ హైదరాబాద్ (అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమి, ఎషాన్ మలింగ.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: జయదేవ్ ఉనాద్కట్.

ముంబై ఇండియన్స్ (అంచనా): రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: కర్ణ్ శర్మ.

Updated Date - Apr 17 , 2025 | 06:21 PM