Share News

Karun Nair Failure: కరుణ్ నాయర్ ఖేల్‌ఖతం.. ఇక డొమెస్టిక్ క్రికెట్ ఆడుకోవాల్సిందే!

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:39 PM

టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే మళ్లీ విఫలమయ్యాడీ రైటాండ్ బ్యాటర్. దీంతో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

Karun Nair Failure: కరుణ్ నాయర్ ఖేల్‌ఖతం.. ఇక డొమెస్టిక్ క్రికెట్ ఆడుకోవాల్సిందే!
Karun Nair

భారత జట్టులోకి చోటు కోసం తీవ్ర పోటీ ఉంటుంది. తోపు ఆటగాళ్లకు కూడా అంత సులువుగా అవకాశాలు రావడం లేదు. కాంపిటీషన్‌ను తట్టుకొని టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తే గొప్పే అని చెప్పాలి. అరంగేట్రం చేయాలనుకుంటున్న కుర్రాళ్లకు ఇది కాస్త ఈజీనే. కానీ ఇప్పటికే భారత జట్టుకు ఆడి దూరమైన ఆటగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం ఏళ్ల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి. ఒకవేళ ఎంట్రీ ఇచ్చినా.. రాణించకపోతే మాత్రం అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదమే ఎక్కువ. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. లేక లేక వచ్చిన అవకాశాన్ని అతడు చేజేతులా మిస్ చేసుకుంటున్నాడు. దీంతో నాయర్ ఖేల్‌ఖతం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


అదృష్టం తలుపు తట్టినా..

భారత జట్టు తరఫున 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు కరుణ్ నాయర్. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాది భవిష్యత్తుపై భరోసా పెంచాడు. అయితే ఆ తర్వాత ఊహించని విధంగా జట్టుకు దూరమైన నాయర్.. రీఎంట్రీ కోసం ఏళ్ల పాటు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. ఎట్టకేలకు ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌తో అదృష్టం అతడి తలుపు తట్టింది. అయితే లక్‌ను నాయర్ సరిగ్గా వాడుకోవడం లేదు. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. దీంతో వెళ్లి డొమెస్టిక్ క్రికెట్ ఆడుకో.. ఇది నీకు సెట్ అవ్వదంటూ అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.

karun-nair.jpg


రాంగ్ టైమ్‌లో..

ఇంగ్లండ్ టూర్‌లో తొలి టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు నాయర్. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేశాడు. ఆ తర్వాత జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో 31, 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు నాయర్. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మొత్తంగా 5 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 97 పరుగులు చేశాడు. మంచి ఆరంభాలు దక్కుతున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు నాయర్. రాంగ్ టైమ్‌లో ఔట్ అవుతుండటంతో పార్ట్‌నర్‌షిప్స్ బ్రేక్ అవుతున్నాయి. ఇప్పటికే అతడికి టీమ్ మేనేజ్‌మెంట్ పలు చాన్సులు ఇచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా 20 నుంచి 30 పరుగుల్లోపే ఔటైతే నాలుగో టెస్ట్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. నాయర్ వైఫల్యంపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో గనుక రాణించకపోతే ఇక దేశవాళీలే గతి అని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

బయటపడ్డ గిల్-సారా రిలేషన్‌షిప్!

సచిన్ వల్ల కానిది బుమ్రా సాధించాడు!

డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారు!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 12:39 PM