Share News

LSG vs SRH Toss: టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. ఇక ఆపడం కష్టమే!

ABN , Publish Date - May 19 , 2025 | 07:05 PM

లక్నో వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ మొదలైపోయింది. ఈ పోరులో టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ ప్యాట్ కమిన్స్ తొలుత ఏం ఎంచుకున్నాడు.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

LSG vs SRH Toss: టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. ఇక ఆపడం కష్టమే!
LSG vs SRH

లక్నో సూపర్ జెయింట్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మొదలైపోయింది. ఏకనా క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న ఈ పోరులో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆతిథ్య లక్నో మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో స్వల్ప మార్పులు చేసింది సన్‌రైజర్స్. యంగ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబేకు తుదిజట్టులో చోటు కల్పించింది ఎస్‌ఆర్‌హెచ్. వెటరన్ స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి స్థానంలో టీమ్‌‌లోకి వచ్చాడు హర్ష్ దూబె. అటు రెగ్యులర్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ లేకపోవడంతో అభిషేక్ శర్మకు జతగా ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నాడు.


ఒకే మార్పు..

లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో అంతగా మార్పులు చేయలేదు. దాదాపుగా గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌నే ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్ కొనసాగించింది. అయితే స్పీడ్‌స్టర్ విల్ రూర్కీకి మాత్రం తుదిజట్టులో అవకాశం కల్పించింది. ఈ ఒక్క మార్పు తప్పితే ఇతర ఆటగాళ్ల విషయంలో కెప్టెన్ రిషబ్ పంత్ ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఈ స్ట్రాటజీ లక్నోకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. అయితే సొంతగడ్డ, అలవాటైన పిచ్, పరిస్థితులు ఆ జట్టుకు తప్పకుండా కలిసొచ్చే అంశమే. కానీ ప్లేఆఫ్స్ బెర్త్ టెన్షన్ ఉంది. కాబట్టి లక్నో ప్లేయర్లు ఎంతవరకు ఆ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారనేది చూడాలి.


ఇవీ చదవండి:

బీసీసీఐ కీలక నిర్ణయం

ఈసారి ఆసియా కప్ జరగనట్టే?

ఒక్కరు గెలిస్తే ముగ్గురు ముందుకెళ్లారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 07:30 PM