India vs Australia 2nd ODI: ఆసిస్‌తో ఓటమికి ఆ ముగ్గురే కారణమా..?
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:35 PM
ఈ ఆల్‌రౌండర్ల నుంచి ఆశించిన ఫలితం రాకపోగా.. బౌలింగ్ పరంగానూ వికెట్ల సామర్థ్యం తగ్గింది. ఈ నిర్ణయం పూర్తిగా జట్టు కూర్పుపై ప్రభావం పడింది. అటు బ్యాటింగ్ ఆర్డర్ ఒత్తిడి ఎదుర్కోగా..
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పెర్త్‌తో పోలిస్తే బ్యాటింగ్ కాస్త మెరుగుపడ్డా.. ఛేజింగ్‌లో పరుగుల వేట ఆశించిన స్థాయిలో సాగలేదు. తీవ్ర ఒత్తిడిలో రోహిత్ శర్మ(73) కీలక ఇన్నింగ్స్ ఆడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ అనుసరించిన వ్యూహాలు అంతటా చర్చనీయాంశమయ్యాయి. ముగ్గురు ఆల్ రౌండర్లతో ఆడించాలనే నిర్ణయం, సూపర్ ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడం వల్లే జట్టు ఓటమిపాలైందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆ నిర్ణయంతో జట్టు కూర్పుపై ప్రభావం!
బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ముగ్గురు ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డిలను ఆడించారు. వీరికి చోటు కల్పించే క్రమంలో కీలక ఆటగాడు కుల్‌దీప్‌ను పక్కన పెట్టారు. ఈ ఆల్‌రౌండర్ల నుంచి ఆశించిన ఫలితం రాకపోగా.. బౌలింగ్ పరంగానూ వికెట్ల సామర్థ్యం తగ్గింది. ఈ నిర్ణయం పూర్తిగా జట్టు కూర్పుపై ప్రభావం పడింది. అటు బ్యాటింగ్ ఆర్డర్ ఒత్తిడి ఎదుర్కోగా.. ఇటు బౌలింగ్‌లోనూ పదును తగ్గింది. దీనివల్లే కంగారూలపై టీమిండియా ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించలేకపోయారు.
సీనియర్ల వైఫల్యం కూడా కారణమే!
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆశించిన ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. విరాట్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అవ్వడం జట్టుకు పెద్ద మైనస్. కెప్టెన్ గిల్ పేలవ ప్రదర్శన జట్టును ఒత్తిడిలోకి నెట్టాయి. మరోవైపు వర్షం కారణంగా ఓవర్లను కుదించడంతో బ్యాటింగ్ లయ దెబ్బతింది. దీనికి తోడు ఆటగాళ్లు కీలక క్యాచ్‌లు వదిలేయడం ఆసీస్‌కు కలిసొచ్చింది. కాగా యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేస్తున్న తరుణంలో, జట్టు మేనేజ్‌మెంట్ తమ వ్యూహాలు, జట్టు కూర్పుపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:
Irfan Khan - Virat Kohli: సోషల్ మీడియాను పట్టించుకోవద్దు: కోహ్లీకి ఇర్ఫాన్ సూచన
Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ: అనిత