Share News

Irfan Pathan: ఆ ఒక్కడ్ని ఔట్ చేస్తే చాలు.. టీమిండియాకు పఠాన్ సూచన!

ABN , Publish Date - Jul 01 , 2025 | 03:14 PM

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు గిల్ సేనకు కీలక సలహా ఇచ్చాడు వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అతడ్ని ఒక్కడ్ని వెనక్కి పంపితే చాలు అన్నాడు.

Irfan Pathan: ఆ ఒక్కడ్ని ఔట్ చేస్తే చాలు.. టీమిండియాకు పఠాన్ సూచన!
IND vs ENG

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌ సమరానికి సిద్ధమవుతోంది టీమిండియా. సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తున్న గిల్ సేన.. ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఉంది. ఒకవేళ ఇక్కడ ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఎలాగైనా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో గెలిచి తీరాలనే పంతంతో కనిపిస్తోంది భారత్. అయితే రెండు విషయాలు జట్టును కలవరపరుస్తున్నాయి. అందులో ఒకటి బౌలింగ్ వైఫల్యం, మరొకటి ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్. జస్‌ప్రీత్ బుమ్రా తప్పితే మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. అటు ప్రత్యర్థి జట్టులోని ఓ బ్యాటర్ మనకు శనిలా దాపురించాడు. ఈ విషయంపై వెటరన్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. అతడేం అన్నాడంటే..

team-india.jpg


ఈజీగా దొరికిపోతాడు..

ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను ఔట్ చేయడం మీద భారత జట్టు ఫోకస్ చేయాలన్నాడు పఠాన్. అతడ్ని ఔట్ చేస్తే సగం పని పూర్తయినట్లేనని చెప్పాడు. ‘ఇంగ్లండ్ జట్టులో మోస్ట్ డేంజరస్ బ్యాటర్ బెన్ డకెట్ ఉన్నాడు. అతడు లీడ్స్ టెస్ట్‌లో అద్భుతమైన సెంచరీ బాదాడు. భారత జట్టుపై అతడు ఇప్పటికే 500కి పైగా పరుగులు కొట్టాడు. అతడు టీమిండియాకు తలనొప్పిగా మారాడు. బుమ్రా-జడేజా బౌలింగ్‌లోనూ తడబాటు, భయం లేకుండా బ్యాటింగ్ చేశాడు. భారత జట్టు అతడ్ని ఔట్ చేయడం మీద దృష్టి పెట్టాలి. అతడి కోసం ప్రత్యేకమైన వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. అతడికి ఫుల్ లెంగ్త్‌లో బంతులు వేస్తూ ఊరించాలి. హిట్టింగ్ చేయించి ఔట్ చేయాలి. ఎల్‌బీడబ్ల్యూ రూపంలోనూ అతడ్ని పెవిలియన్‌కు పంపించొచ్చు. ఒకే లెంగ్త్‌లో బంతులేస్తే ఈజీగా దొరికిపోతాడు’ అని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.

ben-duckett.jpg


ఇవీ చదవండి:

ప్లేయింగ్ 11లోకి తెలుగోడు..

బౌలర్లతో ఊహించని ప్రయోగం

మనసులు గెలుచుకున్న కావ్యా పాప

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 01 , 2025 | 03:19 PM