Share News

Ben Duckett: గిల్ సేనను శనిలా తగులుకున్నాడు.. 3-ఫార్మాట్ స్టార్‌తో కష్టమే!

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:12 PM

టీమిండియాకు శనిలా దాపురించాడో ఇంగ్లండ్ స్టార్. భారత్‌తో మ్యాచ్ అంటే చాలు అతడు చెలరేగి ఆడుతున్నాడు. దీంతో అతడ్ని ఎలా ఆపాలా? అని ఆలోచనలు చేస్తోంది భారత టీమ్ మేనేజ్‌మెంట్.

Ben Duckett: గిల్ సేనను శనిలా తగులుకున్నాడు.. 3-ఫార్మాట్ స్టార్‌తో కష్టమే!
Ben Duckett

లీడ్స్ టెస్ట్‌ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న భారత్.. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో చెలరేగి ఆడాలని అనుకుంటోంది. రెండో టెస్ట్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది గిల్ సేన. బ్యాటింగ్‌తో పాటు ఈసారి బౌలింగ్‌లోనూ తడాఖా చూపించాలని భావిస్తోంది. ఆతిథ్య జట్టు బ్యాటర్ల బెండు తీయాలని చూస్తోంది. అందులో భాగంగా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలో బౌలర్ల బృందం నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతోంది. అయితే ఓ బ్యాటర్ మాత్రం భారత జట్టును ఊపిరి సలపకుండా చేస్తున్నాడు. బౌలింగ్ వేయాలంటే భయపడేలా చేస్తున్నాడు. టీమిండియాకు శనిలా దాపురించిన ఆ ఆటగాడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..

team india


ఓడించాడు..

ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ భారత జట్టును భయపెడుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌లో టీమిండియా ఓటమికి అతడే ప్రధాన కారణమని చెప్పాలి. ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌‌లో 62 పరుగులు చేసిన డకెట్.. రెండో ఇన్నింగ్స్‌లో 149 పరుగుల సూపర్బ్ నాక్‌తో మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పేశాడు. అతడ్ని గానీ ముందే ఔట్ చేసి ఉంటే మ్యాచ్‌లో రిజల్ట్ మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్ అనే కాదు.. సాధారణంగానే భారత్‌పై డకెట్‌కు మంచి రికార్డులు ఉన్నాయి.

ben duckett


3 ఫార్మాట్లలో అదుర్స్..

గత భారత పర్యటనలో ఓ భారీ శతకం బాదాడు బెన్ డకెట్. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో 153 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌తో మ్యాచ్ అంటే తన బెస్ట్ ఇచ్చేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. దీనికి తోడు గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ అతడు అదరగొడుతున్నాడు. భారీ శతకాలతో ఇంగ్లండ్‌కు కీలక మ్యాచ్ విన్నర్‌గా ఎదిగాడు. నిలకడగా పరుగులు చేస్తూ ప్రత్యర్థులకు గుబులు పుట్టిస్తున్నాడు. దీంతో అతడ్ని ఎలాగైనా ఆపాలని టీమిండియా శిబిరం భావిస్తోంది. డకెట్ కోసం బుమ్రా అండ్ కో స్పెషల్ ప్లాన్స్ వేస్తున్నారని తెలుస్తోంది. అతడ్ని ఔట్ చేస్తే ప్రత్యర్థిని కూల్చడం పెద్ద పనేం కాదని భావిస్తోందట. మరి.. డకెట్‌ను మన బౌలర్లు ఎంతమేరకు నిలువరిస్తారో చూడాలి.


ఇవీ చదవండి:

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్

6 నెలలు ఒక్క మాట అనలేదు

చరిత్ర సృష్టించిన డుప్లెసిస్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 12:22 PM