CSK vs KKR Predicted 11: ధోని వర్సెస్ రహానె.. ప్లేయింగ్ 11తో అల్లాడిస్తున్నారు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:15 PM
Today IPL Match: ఐపీఎల్‌లో ఇవాళ మెగా ఫైట్‌కు వేదిక కానుంది చెపాక్ స్టేడియం. సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నేటి పోరులో ఈ రెండు జట్లు ఎలాంటి ప్లేయింగ్ 11తో ముందుకెళ్లనున్నాయో ఇప్పుడు చూద్దాం..

చెపాక్ స్టేడియంలో మరో స్టన్నింగ్ ఫైట్ జరగనుంది. ఇందులో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. రెండు జట్లు ఓటముల్లో ఉన్నాయి కాబట్టి ఇవాళ్టి పోరులో గెలవడం ఖాయం. అయితే రెండు టీమ్స్ కూడా చాలా సమస్యల్లో ఉన్నాయి. బ్యాటర్ల ఫామ్, బౌలర్ల రిథమ్ బిగ్ ఇష్యూస్‌గా మారాయి. అయితే ఇప్పుడు నెగ్గకపోతే గనుక మున్ముందు మ్యాచుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవు. ప్లేఆఫ్స్ చాన్సులు మరింత పడిపోయే డేంజర్ ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు కోసం ఇరు జట్లు నువ్వా నేనా అంటూ తలపడటం ఖాయం. ఈ నేపథ్యంలో నేటి సమరంలో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..
కెప్టెన్ మారాడు
చెన్నైకి రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు. మోచేతి గాయం కారణంగా అతడు సీజన్ నుంచి తప్పుకున్నాడు. కాబట్టి అతడి స్థానంలో లెజెండ్ ఎంఎస్ ధోని సారథ్య బాధ్యతలు చేపడతాడు. రచిన్, కాన్వే ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం ఖాయం. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబె బ్యాటింగ్‌కు వస్తారు. విజయ్ శంకర్, రవీంద్ర జడేజా ఫినిషింగ్ బాధ్యతలు తీసుకుంటారు. వాళ్లకు ధోని సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. నూర్, అశ్విన్ స్పిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం పక్కా. పతిరానా, ఖలీల్ పేస్ పని చూసుకుంటారు.
నో చేంజెస్..
గత మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా కేక్ఆర్ సేమ్ ప్లేయింగ్ ఎలెవన్‌తో వెళ్లే చాన్సులు ఎక్కువ. అదే జరిగితే.. డికాక్, నరైన్ ఓపెనింగ్ చేస్తారు. రహానె, రఘువంశీ, అయ్యర్ ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగుతారు. రింకూ, రస్సెల్, రమణ్‌దీప్ ఫినిషింగ్ బాధ్యతలు తీసుకోవడం ఖాయం. ప్రధాన పేసర్‌గా హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ ఆడతారు. అదనపు స్పిన్నర్ కావాలనుకుంటే మొయిన్ అలీ బరిలోకి దిగుతాడు. మెయిన్ స్పిన్నర్‌గా వరుణ్ ఎలాగూ ఉన్నాడు.
సీఎస్‌కే (అంచనా): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్ & వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీష పత్తిరాన, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్: ముఖేశ్ చౌదరి/అన్షుల్ కాంబోజ్.
కేకేఆర్ (అంచనా): క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మొయిన్ అలీ/స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్: వైభవ్ అరోరా.