Mohammad Naqvi: దుబాయ్ రండి ట్రోఫీ ఇస్తా
ABN , Publish Date - Oct 22 , 2025 | 02:52 AM
ఆసియా కప్ ముగిసి మూడు వారాలు దాటినా.. ట్రోఫీ మాత్రం విజేత భారత్ చెంతకు చేరలేదు. ఈ విషయంలో ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) చీఫ్ మొహిసిన్ నఖ్వీని బీసీసీఐ మరోసారి తీవ్రంగా...
తీరు మారని నఖ్వీ
పద్ధతి మార్చుకోవాలని బీసీసీఐ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఆసియా కప్ ముగిసి మూడు వారాలు దాటినా.. ట్రోఫీ మాత్రం విజేత భారత్ చెంతకు చేరలేదు. ఈ విషయంలో ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) చీఫ్ మొహిసిన్ నఖ్వీని బీసీసీఐ మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. ట్రోఫీని సరైన పద్ధతిలో భారత్‌కు చేర్చాలని డిమాండ్ చేస్తూ మెయిల్ చేసింది. ఇందుకు అఫ్ఘానిస్థాన్, శ్రీలంక బోర్డులు కూడా బీసీసీఐకి మద్దతుగా నిలిచాయి. అయితే, తీరు మారని నఖ్వీ.. ట్రోఫీ అప్పగిస్తానంటూనే కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అదేంటంటే.. వచ్చేనెల 10న దుబాయ్‌లో ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తామనీ, ఆ కార్యక్రమానికి భారత కెప్టెన్ సూర్యకుమార్ సహా జట్టు సభ్యులంతా రావాలని బీసీసీఐకి పంపిన లేఖలో కోరారు. ఆ ఈవెంట్‌లో తన చేతులమీదుగానే ట్రోఫీ అందిస్తానని అందులో వివరించారు. ఇదిలా ఉండగా.. వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో నఖ్వీపై బీసీసీఐ ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆసియా కప్ ఫైనల్లో పాక్‌ను ఓడించిన భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి