Brett Lee: భారత్‌లో క్రికెట్‌కు ఎప్పటికీ ఆ పరిస్థితి రాదు.. బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:30 AM
ఆధునిక క్రికెట్‌కు భారత్ కేంద్రంగా మారిందని, అక్కడివారికి ఆట పట్ల ఉన్న అంకిత భావమే అందుకు కారణమని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు. క్రికెట్‌ను భారీ ఆదాయ వనరుగా మార్చడంలో టీమిండియా కీలక పాత్ర పోషించిందని, భారత్‌లో క్రికెట్‌కు ఎప్పటికీ ఆదరణ తగ్గదని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.
ఆధునిక క్రికెట్‌కు భారత్ కేంద్రంగా మారిందని, అక్కడివారికి ఆట పట్ల ఉన్న అంకిత భావమే అందుకు కారణమని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు. క్రికెట్‌ను భారీ ఆదాయ వనరుగా మార్చడంలో టీమిండియా కీలక పాత్ర పోషించిందని, భారత్‌లో క్రికెట్‌కు ఎప్పటికీ ఆదరణ తగ్గదని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో పోల్చుకుంటే ఆస్ట్రేలియాలో క్రికెట్‌కు పరిమితులు ఎక్కువగా ఉంటాయని అన్నాడు (Brett Lee India cricket).
భారతీయుల వల్లే క్రికెట్ నడుస్తోందని, బ్రెజిల్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ తగ్గే రోజు వస్తుందేమో గానీ, భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ ఎప్పటికీ తగ్గదని బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. 'ఆస్ట్రేలియాలో ఎంత ప్రచారం చేసినా క్రికెట్‌కు ఆదరణ ఉండదు. భారత్‌లో ఆ ఇబ్బంది లేదు. అక్కడ క్రికెట్‌ను అభిమానించే కోట్ల మంది ఉన్నారు. అక్కడి కోట్ల మంది జనాభాలో క్రికెట్ ఇష్టపడని వారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. భారత్‌తో పోల్చుకుంటే ఆస్ట్రేలియాలో క్రికెటర్లకు పెద్దగా గుర్తింపు ఉండద'ని బ్రెట్ లీ పేర్కొన్నాడు.
ప్రస్తుతం టీ-20 క్రికెట్‌ను వీక్షించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఇప్పటితరం పిల్లలు అంతా వేగంగా జరిగిపోవాలని కోరుకుంటున్నారని బ్రెట్ లీ అన్నాడు. ఏ ఫార్మాట్‌లో అయినా క్రికెట్ చాలా కాలం మనుగడ సాధిస్తుందని, భారత్ వంటి దేశాల అండతో మరింత పైకి ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బ్రెట్ లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి