Share News

BCCI To Appoint Nathan Kiely: సంచలన నిర్ణయం వైపు బీసీసీఐ!

ABN , Publish Date - Nov 10 , 2025 | 07:40 PM

భారత మహిళా జట్టు విషయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (BCCI) చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తొలిసారి ఓ విదేశీ వ్యక్తిని భారత జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా నియమించబోతున్నట్లు తెలుస్తోంది.

BCCI To Appoint Nathan Kiely: సంచలన నిర్ణయం వైపు బీసీసీఐ!
India Women

భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్(World Cup 2025)ను గెలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో దశాబ్దాల కలను హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు నెరవేర్చింది. విశ్వవిజేతగా నిలవడంతో భారత మహిళా జట్టు క్రేజీ అమాంతం పెరిగింది. ఈ క్రమంలోనే ఈ జట్టు విషయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (BCCI) చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తొలిసారి ఓ విదేశీ వ్యక్తిని భారత జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా (Strength And Conditioning Coach) నియమించబోతున్నట్లు తెలుస్తోంది.


నాథన్ కైలీ(Nathan Kiely)ని స్ట్రైంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ గా నియమించనున్నట్లు తెలుస్తుంది. కైలీతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు సమచారం. ప్రస్తుతం బంగ్లాదేశ్(Bangladesh) పురుషుల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా నాథన్ కైలీ వ్యవహరిస్తున్నారు. బీసీసీఐతో అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తై.. కైలీ భారత మహిళా క్రికెట్‌ జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఎంపికైతే.. అదో రికార్డు అవుతుంది. అంతేకాక టీమిండియా మహిళల క్రికెట్‌ జట్టు చరిత్రలో తొలిసారి ఓ విదేశీ వ్యక్తి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా నియమించినట్లు అవుతుంది. ఇప్పటివరకు బీసీసీఐ(BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి చెందిన వారు మాత్రమే మహిళల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లుగా పనిచేశారు. ప్రస్తుతం భారత మహిళల జట్టుకు అల్ హర్షా ఈ పదవిలో ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో ఆయన అద్భుతంగా పనిచేశారు. కానీ త్వరలో ఆయకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. హర్షా స్థానాన్ని కైలీ(Nathan Kiely) భర్తీ చేస్తాడని బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి తెలిపినట్లు సమాచారం.


కాగా, ఇటీవలికాలంలో క్రికెట్‌ జట్ల విజయాల్లో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌(Strength And Conditioning Coach)లు కీలక పాత్రపోషించారు. ప్లేయర్లలో శారీరక సామర్థ్యం, ఫిట్‌నెస్, గాయాల నివారణ, మానసిక స్థైర్యం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. జట్టులో ప్రతి ఆటగాళ్లకు వీరు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తుంటారు. దేశీయ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లతో పోలిస్తే విదేశీ కోచ్‌లకు పని అనుభవం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరి సేవల కోసం దాదాపుగా అన్ని జట్లు ఎదురు చూస్తుంటాయి. భారత పురుషుల జట్టు(Team India) ఇటీవలే సౌతాఫ్రికాకు చెందిన అడ్రియన్‌ లె రూక్స్‌ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ గా నియమించుకుంది.


ఇవి కూడా చదవండి..

Mitchell Starc: బౌలింగ్‌లో అదరగొట్టిన మిచెల్‌ స్టార్క్‌..


Former Bangladesh Captain: బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు


మరిన్ని వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 10 , 2025 | 07:56 PM