Laddoo Softserve: లడ్డూ ఇలాక్కూడా ఉంటుందా.. క్రియేటివిటీ పీక్స్
ABN , Publish Date - Nov 10 , 2025 | 07:08 PM
ఆస్ట్రేలియాలోని ఓ రెస్టారెంట్ లడ్డూ రూపురేఖలను సమూలంగా మార్చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన లడ్డూను చూసి జనాలు షాకయిపోతున్నారు. కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం ఇది కరెక్ట్ కాదంటూ పెదవి విరుస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే, పాశ్చాత్యులకు మన రుచులను మరింత చేరువ చేసేందుకు ఆస్ట్రేలియాలోని ఓ రెస్టారెంట్ చేసిన ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Besan Laddo Softserve).
లడ్డూలంటే తెలియని భారతీయులు ఉండరు. ఎందరికో ఇది ఫేవరెట్ స్వీట్. అయితే, భారతీయ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఓ రెస్టారెంట్ లడ్డూలతో ఓ వినూత్న ప్రయోగం చేసింది. స్థానికులకు ఈ టేస్టును మరింత చేరువ చేద్దామనుకున్న రెస్టారెంట్ వారు ఓ కొత్త ప్రయోగానికి తెర తీశారు. లడ్డూ పిండిని ఐస్‌క్రీమ్ వలె సాఫ్ట్‌సర్వ్ రూపంలో జనాలకు అందించడం ప్రారంభించారు (Food Experiment Viral Video).
‘నా వద్ద ఓ రోజు కొంత లడ్డూ మిగిలిపోయింది. ఆ సమయంలో ఇలా సాఫ్ట్ సర్వే లా లడ్డూలను అందించాలన్న ఆలోచన వచ్చింది’ అని రెస్టారెంట్‌కు చెందిన ఓ మహిళ వివరించారు. ఐస్‌క్రీమ్ మెషీన్ నుంచి వచ్చే క్రీమ్‌ను కోన్‌లో పట్టుకున్నట్టుగా ఈ లడ్డూ సాఫ్ట్‌సర్వ్‌ను కూడా చిన్న కాఫీ గ్లాస్‌లో ఇస్తారు.
ఇక లడ్డుపై చేసిన ఈ వినూత్న ప్రయోగం చూసి భారతీయులు ఆశ్చర్యపోయారు. అద్భుతంగా ఉందని కామెంట్ చేశారు. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్‌ను కూడా ఈ వీడియో ఆకర్షించింది. ఇది అద్భుతంగా ఉందని ఆమె కూడా కామెంట్ చేశారు. ఇలాంటిది ముంబైలో కూడా కావాలని అన్నారు. చూస్తేనే నోరూరుతోందని కూడా మరికొందరు కామెంట్ చేశారు. కొందరు మాత్రం ఈ ప్రయత్నంపై పెదవి విరిచారు. చూడటానికి బాగానే ఉన్నా తాము మాత్రం పాత విధానంలోనే లడ్డూను తినడాని ఇష్టపడతామని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
హెచ్ఆర్ తప్పిదం.. ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్టు ఈమెయిల్
ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. విమానం నుంచి కిందకు చూస్తే..