Mitchell Starc: బౌలింగ్‌లో అదరగొట్టిన మిచెల్ స్టార్క్..
ABN , Publish Date - Nov 10 , 2025 | 07:01 PM
యాషెస్ సిరీస్ కు ముందు ప్రత్యర్థి ఇంగ్లాండ్ కు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ స్ట్రాంగ్ వార్నింగ్ పంపాడు. యాషెస్ సన్నాహకాల్లో భాగంగా పెఫీల్ట్ షీల్డ్ టోర్నీ ఆడుతున్నాడు. న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడుతున్న స్టార్క్.. విక్టోరియా జట్టుపై 4 వికెట్లతో చెలరేగాడు.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య త్వరలో యాషెస్ సిరీస్ జరగనుంది. నవంబర్ 21న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్ కు ముందు ప్రత్యర్థి ఇంగ్లాండ్ కు ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపాడు. యాషెస్ సన్నాహకాల్లో భాగంగా పెఫీల్ట్ షీల్డ్ టోర్నీ ఆడుతున్నాడు. న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడుతున్న స్టార్క్.. విక్టోరియా జట్టుపై 4 వికెట్ల ప్రదర్శనలతో చెలరేగాడు.
సోమవారం ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా(NSW vs Victoria) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన విక్టోరియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఆట ప్రారంభం నుంచే నిప్పులు చెరిగిన స్టార్క్.. ఓపెనర్లు క్యాంప్‌బెల్ కెల్లావే (51), హ్యారీ డిక్సన్ (20) సహా కీలకమైన ఒలివర్ పీక్ (0), సామ్ హార్పర్ (54) వికెట్లు పడగొట్టాడు. స్టార్క్(Mitchell Starc)తో పాటు నాథన్ లియోన్ 2, సీన్ అబాట్ 1 వికెట్ ను తీశారు. వీరు ముగ్గురు రాణించడంతో న్యూ సౌత్ వేల్స్ తొలి రోజు ఆటలో 7 వికెట్లు తీసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి విక్టోరియా 340 పరుగులు చేసింది.
ప్రస్తుతం కెప్టెన్ విల్ సదర్‌ల్యాండ్ (36), సామ్ ఇలియట్ (4) క్రీజ్‌లో ఉన్నారు. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (104) సెంచరీ సాధించి, విక్టోరియా ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. న్యూ సౌత్ వేల్స్‌కే ఆడుతున్న మరో ఆసీస్ స్పీడ్‌స్టర్ జోష్ హాజిల్‌వుడ్(Josh Hazlewood) తొలి రోజు వికెట్ తీయలేకపోయాడు. హాజిల్‌వుడ్ ప్రత్యర్ది బ్యాటర్లను ఇబ్బంది పెట్టినా వికెట్ లేకుండా చివరి రోజు ఆట ముగించాడు. మొత్తంగా స్టార్క్ .. ఇంగ్లాండ్ కు పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు అయిందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నిప్పులు చెరిగే బౌలింగ్ తో విక్టోరియా బ్యాటర్లను స్టార్క్ (Starc)భయపెట్టాడు.
అలానే ఇవాళ(సోమవారం) ప్రారంభమైన మరో మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా, టస్మానియా(Tasmanian) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా జట్టు 209 పరుగులకే ఆలౌటైంది. సౌత్ ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రెండన్ డాగ్గెట్ 5, లియామ్ స్కాట్ 3, మెక్ ఆండ్రూ 1, థార్న్‌టన్ 1 వికెట్ తీశారు. టస్మానియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సిల్క్ (64) ఒక్కడే రాణించాడు. యాషెస్ తొలి టెస్ట్ జట్టులో సభ్యుడైన బ్యూ వెబ్‌స్టర్ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. మెక్‌స్వీని (2), జేసన్ సంఘా (12), ట్రవిస్ హెడ్ (9) ఔటయ్యారు. ప్రస్తుతం హెన్రీ హంట్ (34), అలెక్స్ క్యారీ (25) క్రీజ్‌లో ఉన్నారు. టస్మానియా బౌలర్లలో జాక్సన్ బర్డ్(Jackson Bird) 2, వెబ్ స్టర్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి..
Dhruv Jurel Earns Test Squad: జురెల్‌కు బెర్త్ ఖరారే
Former Bangladesh Captain: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు
మరిన్ని వార్తలు కోసం క్లిక్ చేయండి..