Share News

Australian cricketer cancer news: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌కు కేన్సర్.. సర్జరీ చేయించుకున్న ప్లేయర్

ABN , Publish Date - Aug 27 , 2025 | 06:01 PM

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ లెజెండ్ మైకేల్ క్లార్క్ కేన్సర్ బారిన పడ్డాడు. అతడికి స్కిన్ కేన్సర్ సోకినట్టు తెలిపాడు. స్కిన్ కేన్సర్ కారణంగా మరో సర్జరీ చేయించుకున్నట్టు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు స్టార్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా క్లార్క్ 2004-2015 మధ్య కాలంలో కీలకంగా వ్యవహరించాడు.

Australian cricketer cancer news: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌కు కేన్సర్.. సర్జరీ చేయించుకున్న ప్లేయర్
Michael Clarke health update).

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ లెజెండ్ మైకేల్ క్లార్క్ కేన్సర్ బారిన పడ్డాడు. అతడికి స్కిన్ కేన్సర్ సోకినట్టు తెలిపాడు. స్కిన్ కేన్సర్ కారణంగా మరో సర్జరీ చేయించుకున్నట్టు పేర్కొన్నాడు (Michael Clarke health update). ఆస్ట్రేలియా జట్టుకు స్టార్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా క్లార్క్ 2004-2015 మధ్య కాలంలో కీలకంగా వ్యవహరించాడు. అతడి నేతృత్వంలోనే ఆస్ట్రేలియా 2013-14 యాషెస్ సిరీస్‌ను, 2015 ప్రపంచకప్‌ను గెలుచుకుంది (Michael Clarke skin cancer).


'నా ముక్కుపై మరో కట్ పడింది. మీ చర్మానికి సంబంధించి పరీక్షలు తరచుగా చేయించుకోండి. చికిత్స తీసుకోవడం కంటే నివారణ చాలా ఉత్తమం. నేను రెగ్యులర్ చెకప్‌లు, ముందస్తుగా గుర్తించడం చాలా కీలకంగా మారాయి. ఆస్ట్రేలియాలో చర్మ కేన్సర్‌లు సర్వసాధారణం' అని క్లార్క్ గుర్తు చేశాడు. క్లార్క్‌కు కేన్సర్ సోకడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా క్లార్క్‌ను పలు కేన్సర్‌లు వేధించాయి. క్లార్క్‌కు చర్మ కేన్సర్ రావడం ఇది రెండోసారి అని తెలుస్తోంది.


ఆస్ట్రేలియాలో చర్మ కేన్సర్‌లు రావడం సహజమే (skin cancer news). ఆస్ట్రేలియాలో 70 సంవత్సరాల వరకు బతికిన ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఏదో ఒక స్కిన్ కేన్సర్ బారిన పడే ఉంటారట. దానికి కారణం అక్కడి వాతావరణం. భూమధ్య రేఖకు సమీపంలో ఉండడం, యూవీ రేడియేషన్ ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో ఆస్ట్రేలియన్లు ఎక్కువగా చర్మ కేన్సర్ బారిన పడుతుంటారట.


ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్‌ అవుట్‌

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం

మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2025 | 06:01 PM