IND vs PAK Match tickets: వామ్మో.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. టికెట్ ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Aug 28 , 2025 | 06:45 PM
వచ్చే నెల 9వ తేదీ నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ రెండు జట్లు కలిసి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
వచ్చే నెల 9వ తేదీ నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ రెండు జట్లు కలిసి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది (IND vs PAK). ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని ఇప్పటికే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. మాజీలతో పాటు కొందరు భారత అభిమానులు కూడా పాకిస్థాన్‌తో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడకూడదని భావిస్తున్నారు (IND vs PAK ticket black marketing).
సెప్టెంబర్ 14న మ్యాచ్ జరుగుతుందో, లేదో పూర్తిగా తెలియదు గానీ, ఆ మ్యాచ్ టిక్కెట్ల ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి (Asia Cup 2025 tickets). భారత్, పాక్ మ్యాచ్ టిక్కెట్లను కొన్ని సైట్లు బ్లాక్‌లో అమ్ముతున్నాయట. ఒక్కో టికెట్ ధర రూ.15.74 లక్షలు పలికినట్టు వార్తలు వస్తున్నాయి (₹15 lakh cricket ticket). అయితే అధికారికంగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను అమ్మడం ప్రారంభించలేదు. మరో రెండ్రోజుల్లో భారత్, పాక్ మ్యాచ్ టికెట్ల విక్రయం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లు ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను విక్రయిస్తున్నాయట.
ఈ మ్యాచ్‌కు అధికారిక ధరను రూ.26, 256గా నిర్ణయించి విక్రయానికి ఉంచారట. అయితే ఆ టికెట్ ధర గరిష్టంగా రూ.15.74 లక్షలకు చేరిందట (India Pakistan match 2025). అయితే అలాంటి వెబ్‌సైట్లలో టికెట్లను కొని మోసపోవద్దని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచిస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే టికెట్లు కోనుగోలు చేయాలని తెలిపింది. శని, ఆదివారాల్లో భారత్, పాక్ మ్యాచ్ టికెట్లను అందుబాటులో ఉంచే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి