Pakistan vs India: పాకిస్తాన్ బౌలింగ్ ముందు భారత్ స్లో బ్యాటింగ్.. పడిపోయిన 4 వికెట్లు, ఆటకు బ్రేక్
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:55 PM
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రేమదాస మైదానంలో జరుగుతున్న మ్యాచులో భారత జట్టు స్లోగా ఆడుతోంది. ప్రస్తుతం వర్షం కారణంగా ఆటకు బ్రేక్ ఇచ్చారు. ఇండియా 154 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఆర్.ప్రేమదాస మైదానంలో ఆదివారం జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ లో భారత జట్టు పాకిస్తాన్ బౌలర్ల ముందు స్లోగా ఆడుతోంది. ప్రస్తుతం భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కొలంబోలో వర్షం కారణంగా ఆటకు బ్రేక్ ఇచ్చారు. వర్షం తగ్గిన తర్వాత మళ్లీ గేమ్ కొనసాగిస్తారు. భారత రన్ రేట్ ప్రస్తుతం 4.5 స్థాయిలో ఉంది. ఇది ఆందోళనకరం అయినా, మిగిలిన బ్యాటర్లు సెట్ అయితే, 250+ స్కోర్ చేసి పాకిస్తాన్‌ను ఓడించే ఛాన్సుంది.
పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు ఆటకు దిగింది. పిచ్ రిపోర్ట్ ప్రకారం, గ్రాస్ ఎక్కువ, మొదటి ఓవర్లలో తేమ ఉంటుంది. స్ట్రెయిట్ బౌండరీ 70 మీటర్లు, సైడ్‌లు 56-63 మీటర్లు. కాగా, ఈసారి ఫాతిమా సనా జట్టు బౌలింగ్ విషయంలో సవాల్ విసురుతోంది.
మంధనా మొదట్లో స్లోగా ఆడింది, కానీ 19 బంతుల్లో 23* రన్స్ చేసింది. పవర్‌ప్లే ముగిసే సమయంలో భారత్ 1 వికెట్‌తో మంచి స్కోర్ చేసింది. హర్లీన్ డియోల్ మొదటి బౌండరీతో ఓపెనింగ్ అకౌంట్ తెరిచింది. కానీ, 3:54కి ఫాతిమా సనా షార్ట్ లెంగ్త్ బంతితో మంధనాను 23కి ఔట్ చేసింది. దీంతో బెలిండా క్లార్క్ రికార్డు (35)ను మంధనా బ్రేక్ చేయలేదు. తర్వాత ప్రతికా రావల్ 16 బంతుల్లో 22 రన్స్ చేసి మంచి స్టార్ట్ ఇచ్చింది.
కానీ పవర్‌ప్లే ముగిసిన తర్వాత స్లో అయింది. రావల్ 31 (37) పరుగులు చేసి ఔటైంది. తర్వాత హర్లీన్ డియోల్ 65 బంతుల్లో 46 పరుగులు చేసింది. ఇప్పుడు భారత్ 4/154లో ఉంది. పిచ్ మొదట్లో స్లో, కానీ మిడిల్‌లో రన్స్ వస్తాయి. భారత్ మొదటి మ్యాచ్‌లో 200+ చేసి గెలిచింది. ఇప్పుడు కూడా 200 ప్లస్ టార్గెట్ పెడితే సేఫ్ అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి