Shocking Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. మారుతీ సుజుకీ స్టాక్ యార్డ్‌ను చూశారా? వీడియో వైరల్..
ABN , Publish Date - Aug 26 , 2025 | 08:30 PM
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే కార్లు మారుతీ సుజుకీ కంపెనీకి చెందినవే. ఎన్నో ఏళ్లుగా ఈ కంపెనీకి చెందిన కార్లు భారతీయుల మనసులను చూరగొన్నాయి. దీంతో భారత్‌లోనే మారుతీ సుజుకీ కంపెనీ ఓ అత్యాధునిక ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది.
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే కార్లు మారుతీ సుజుకీ కంపెనీకి చెందినవే. ఎన్నో ఏళ్లుగా ఈ కంపెనీకి చెందిన కార్లు భారతీయుల మనసులను చూరగొన్నాయి. దీంతో భారత్‌లోనే మారుతీ సుజుకీ కంపెనీ ఓ అత్యాధునిక ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. విడి భాగాలను ఆ ప్లాంట్‌లోనే అమర్చి విక్రయ కేంద్రాలకు తరలిస్తుంది. మారుతీ సుజుకీ కంపెనీకి గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో విశాలమైన, అత్యాధునిక ప్లాంట్ ఉంది (Maruti car stock).
హన్సల్‌పూర్ కేంద్రం నుంచి మారుతీ సుజుకీ సంస్థ ప్రతి ఏటా 7, 50, 000 కార్లను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (మంగళవారం) ఆ ప్లాంట్‌కు వెళ్లారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనం 'ఇ-విటారా'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యంతో కళ్లు తేలెయ్యక తప్పదు. ఆ వీడియో హన్సల్‌పూర్‌లో ఉన్న మారుతి సుజుకి స్టాక్ యార్డ్‌కు సంబంధించినది (Maruti Suzuki stockyard).
డ్రోన్ ద్వారా చిత్రీకరించిన ఆ వీడియోలో స్టాక్ యార్డ్‌లో పార్క్ చేసి ఉన్న కొత్త కార్లు కనిపిస్తున్నాయి. అక్కడ వేల సంఖ్యలో కార్లు ఉన్నాయి. అవన్నీ ఆ వీడియోలో చిన్న చిన్న పెట్టెల తరహాలో కనిపిస్తున్నాయి. ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఆ ప్లాంట్ నుంచి భారత నగరాలకే కాదు.. పలు విదేశాలకు కూడా మారుతీ సుజుకీ సంస్థ కార్లను ఎగుమతి చేస్తుంది.
ఇవి కూడా చదవండి..
ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..
రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..