Viral: అనుమతి లేకుండా తొటి ప్రయాణికుడి చార్జర్ తీసుకున్న మహిళ! ఎందుకని ప్రశ్నిస్తే..
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:43 PM
తోటి ప్రయాణికుడి ఫోన్ చార్జర్‌ను అనుమతి లేకుండా తీసుకుందో మహిళ. ఇది దొంగతనం అని బాధితుడు అంటే తను చేసింది తప్పేకాదని ఆమె వితండవాదానికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: మనం చార్జర్ వెంట తీసుకెళ్లడం మర్చిపోతే పక్కనున్న వారి సాయం తీసుకుంటాం. ఎదుటి వ్యక్తి అనుమతిచ్చాకే వారి చార్జర్ వాడుకుంటాం. కానీ ఓ విమాన ప్రయాణికురాలు ఇలాంటి మర్యాదలేవీ పాటించ లేదు. పైపెచ్చు తను చేసిన దాంట్లో తప్పేమీ లేదన్నట్టు వితండవాదానికి దిగింది. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా జనాలు ఆమె తీరును చూసి మండిపడుతున్నారు. దుమ్మెత్తిపోస్తున్నారు (Viral).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ మహిళ చెప్పాపెట్టకుండా తోటి ప్రయాణికుడి నుంచి యాపిల్ ఫోన్ చార్జర్ తీసుకుంది. ఏదో కారణంతో ప్రయాణికులు విమానం దిగాల్సి వచ్చింది. ఆ సమయంలో మహిళ అతడి అనుమతి లేకుండానే చార్జర్ తీసుకుంది. మళ్లీ వాళ్లు విమానంలోకి వచ్చిన సందర్భంగా ఇతర ప్రయాణికులు అతడికి చార్జర్ విషయాన్ని చెప్పారు.
Viral: విమానం గాల్లో ఉండగా కిటికీ అద్దం విరగగొట్టిన ప్యాసింజర్! ఎందుకో తెలిస్తే..
దీంతో, ఆ మహిళ ఎదురు పడగానే అతడు నిలదీశాడు. అనుమతి లేకుండా తన చార్జర్ ఎందుకు తీసుకున్నావని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనుమతి లేకుండా తీసుకుంటే దాన్ని దొంగతనం అంటారని ఆమెను కడిగిపారేశాడు. కానీ మహిళ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. తన చేసిన దాంట్లో తప్పేమీ లేదన్నట్టు, అదంత పెద్ద విషయమే కాదన్నట్టు ప్రవర్తించింది. ఫ్లైట్‌లో ఎవరో లేకపోవడంతో తీసుకున్నానని నిర్మొహమాటంగా చెప్పింది. తన చేసిన దాంట్లో తప్పేమిటని ఎదురు ప్రశ్నించింది. అయితే, మరో వ్యక్తి ఆ మహిళకు వంత పాడే ప్రయత్నం చేశాడు. లైట్ తీసుకో పెద్ద ఇష్యూ చేయకు అంటూ బాధిత ప్రయాణికుడిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదం విమానంలో అనేక మందికి ఇబ్బంది కలిగించింది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందీ మాత్రం తెలియరాలేదు.
Viral: చోరీకొచ్చిన దొంగ.. దేవుడి పటం కిందపడటం గమనించగానే..
ఇక వీడియో నెట్టింట వైరల్ అవడంతో నెటిజన్లు కూడా షాకైపోతున్నారు. మనుషుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ఏం చేసినా చెల్లుతుందనే ధోరణి మహిళలో కనిపించిందని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. మనుషులు కనీస సంస్కారం, మర్యాదలు కూడా మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. మరీ ఈ వింత వివాదంపై మీరూ ఓ లుక్కేయండి.