Share News

Viral: చోరీకొచ్చిన దొంగ.. దేవుడి పటం కిందపడటం గమనించగానే..

ABN , Publish Date - Feb 08 , 2025 | 10:58 PM

షాపులోకి చోరీకొచ్చిన ఓ దొంగ తన కారణంగా దేవుడి ఫొటో కిందపడటం చూసి పశ్చాత్తాపం చెందాడు. దేవుడికి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి సైలెంట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: చోరీకొచ్చిన దొంగ.. దేవుడి పటం కిందపడటం గమనించగానే..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో దొంగలు చోరికి సంబంధించిన పలు వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. గుళ్లో కూడా చోరీలకు తెగ బడే కొందరు దొంగలు దేవుడికి దండం పెట్టి మరీ తమ పని కానిచ్చేసిన ఘటనలు మనం చూశాం. అయితే, తాజా ఘటనలో ఓ దొంగ దేవుడి ఫొటో చూసి చివరి నిమిషంలో తన మనసు మార్చుకున్నాడు. చోరీ చేయకుండానే వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral).

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ దొంగ షట్టర్ ఎత్తి ఓ షాపులోకి ప్రవేశించాడు. అతడు లోపలికొచ్చే క్రమంలో ఓ టేబుల్‌ను కాలితో పక్కకు జరిపాడు. ఈ క్రమంలో ఓ దేవుడి ఫొటో కింద పడింది. అది గమనించిన అతడు వెంటనే ఫొటోను చేతుల్లోకి తీసుకుని దండం పెట్టాడు. తన తప్పును క్షమించమని కోరుతున్న రీతిలో దేవుడికి దండం పెట్టాడు. అయితే, ఆ తరువాత అతడు పశ్చాత్తాపంతో వెనుదిరిగినట్టు కూడా తెలిసింది. ఈ దృశ్యం మాత్రం వీడియోలో రికార్డు కాలేదు.


Viral: భార్యపై ఇలాంటి రివెంజ్ తీర్చుకోవడం మీరెక్కడా చూసుండరు!

అయితే, ఈ ఉదంతం నెట్టింట వైరల్ కావడంతో జనాలు రకరకాల వ్యాఖ్యలతో కామెంట్ సెక్షన్‌ను హోరెత్తిస్తున్నారు. దేవుడి అతడిలో మార్పు తీసుకొచ్చాడని కొందరు కామెంట్ చేశాడు. హృదయపరివర్తనం అంటే ఇదే అంటూ మరికిందరు వ్యాఖ్యానించారు. అది దేవుడి హెచ్చరికగా భావించి వెనుదిరిగి ఉండాటని కొందరు అభిప్రాయపడ్డారు. మరో షాపులో దొంగతనం చేయమని దేవుడి సంకేతమిచ్చి ఉంటాడని భావించి దొంగ వెనుదిరిగి ఉండొచ్చని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు.


CIBIL Score: సిబిల్ స్కోరు తక్కువగా ఉన్న వరుడికి షాక్! చివరి నిమిషంలో పెళ్లి రద్దు!

ఇక కొందరు మాత్రం దొంగ వెనుదిరిగినట్టు ఉన్న దృశ్యాలు కనబడకపోవడంపై సందేహం వ్యక్తం చేశారు. అసలు ఈ వీడియో నిజమా లేక ప్రాంక్ వీడియోనా అని ప్రశ్నలు కురిపించారు. ఈ ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేకపోయినా జనాలను మాత్రం ఈ వీడియో తెగ ఎంటర్‌టైన్ చేస్తూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మరి ఈ ఆసక్తికర వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

అమెరికాలో కూడా ఇటీవల ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. తను చోరీ చేసిన కారు వెనక సీటులో పసిపాప ఉన్న విషయం చూసి షాకైపోయాడు. ఆ తరువాత ఆలస్యం చేయకుండా వెంటనే కారును తీసుకెళ్లి చిన్నారి తల్లిదండ్రులకు అప్పగించాడు. అంతేకాకుండా, తల్లిదండ్రులు నిర్లక్ష్యంతో చిన్నారిని కారులో ఒంటరిగా వదిలిపెట్టడంపై కూడా వారిని తలంటేశాడు.

Read Latest and Viral News

Updated Date - Feb 08 , 2025 | 10:58 PM