Share News

Woman Viral Video: నీళ్లు తాగాలన్నా బ్రెయిన్ వాడాలి.. ఈమె తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jun 28 , 2025 | 08:36 PM

ఓ మహిళకు దాహం వేయడంతో నీళ్లు తాగడానికి కుళాయి వద్దకు వెళ్లింది. అయితే గ్లాస్ లేకపోవడంతో నీళ్లు తాగడానికి ఇబ్బందిగా మారింది. దీంతో చివరకు ఆమె బ్రెయిన్ వాడి నీళ్లు తాగేసింది. ఈమె నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Woman  Viral Video: నీళ్లు తాగాలన్నా బ్రెయిన్ వాడాలి.. ఈమె తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

వినూత్నంగా ఆలోచించాలే గానీ.. ఎంత పెద్ద సమస్యకైనా ఇట్టే పరిష్కారాన్ని కనిపెట్టవచ్చు. ఇందుకు నిదర్శనంగా కొందరు విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. పాత వాహనాల విడి భాగాలతో సరికొత్త వాహనాలను తయారు చేయడం, మూత లేని కొళాయిలకు పక్కన పడేసి పేస్ట్ డబ్బాలను వాడడం వంటి వింత వింత ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఓ మహిళ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. రైల్వే స్టేషన్‌లో కుళాయి నీరు తాగడంలో మహిళకు సమస్య తలెత్తింది. దీంతో చివరకు ఆమె చేసిన నిర్వాకం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా.. నీళ్లు తాగాలన్నా బ్రెయిన్‌ను వాడాలంటే ఇదేనేమో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగగానే ప్రయాణికులంతా కిందకు దిగి ఎవరికి కావాల్సిన ఆహార పదార్థాలను వారు కొంటున్నారు. ఈ క్రమంలో ఓ మహిళకు దాహం వేయడంతో నీళ్లు తాగడానికి కుళాయి (Tap water) వద్దకు వచ్చింది. అయితే గ్లాస్ లేకపోవడంతో నీళ్లు తాగడానికి ఇబ్బందిగా మారింది.


కుళాయి పైన ప్రెస్ బటన్ ఉండడంతో రెండు చేతులతో నీళ్లు తాగడానికి వీలు కాలేదు. రెండు, మూడు సార్లు ప్రెస్ చేసి, నీళ్లు తాగడానికి వీలు కాకపోవడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. చివరకు తన బుర్రకు పని చెప్పింది. ఏకంగా తన తలను కుళాయిపై ఉంచి బటన్‌ను ప్రెస్ చేసింది. దాన్ని తలతో అలాగే పట్టుకుని, రెండు చేతులతో నీళ్లు తాగేసిందన్నమాట.


ఇలా ఆమె ఎంతో తెలివిగా కుళాయి నీటిని తాగడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘బ్రెయిన్ వాడితే ఇలాంటి అద్భుతాలు చేయొచ్చు’.. అంటూ కొందరు, ‘నీళ్లు తాగాలన్నా బ్రెయిన్ ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 3.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 08:46 PM